Prema Geema Jantha Nai
-
ప్రేమా గీమా జాన్ తా నయ్ మూవీ సక్సస్ మీట్
-
ప్రేమ గీమ జాన్తా నయ్ మూవీ స్టిల్స్
ఇండియన్ ఐడల్ శ్రీరామ్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రేమ గీమ జాన్తా నయ్ బార్పీ కథానాయికగా సుబ్బు ఆర్ వీ దర్శకుడుగా శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ. -
ప్రేమా లేదు.. గీమా లేదు..!
‘‘ఇండియన్ ఐడల్‌గా నన్ను నిలబెట్టడానికి తెలుగువారు ఎంతో కృషి చేశారు. నన్ను గాయకునిగానే అంతగా ఆదరించిన ప్రజలు కథానాయకునిగా కూడా తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అని శ్రీరామచంద్ర అన్నారు. సుబ్బు ఆర్వీ దర్శకత్వంలో శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా మద్దాల భాస్కర్(భాను) నిర్మించిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్తానయ్’. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్‌కి అందించారు. వారితో పాటు సుమన్, నరేష్, భానుచందర్, సాయికుమార్, శ్రీకాంత్ అడ్డాల, వీరు పోట్ల, జె.కె.భారవి, కె.ఎం.రాధాకృష్ణన్, సురేష్‌కొండేటి, ఐఏఎస్ అధికారి చక్రవర్తి అతిథులుగా పాల్గొని చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు ముందే నాకు హీరోగా చాలా అవకాశాలొచ్చాయి. కానీ... మంచి అవకాశం కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాను. దర్శకుడు అద్భుతమైన కథను తయారు చేశారు. చాలా కష్టపడి ఈ పాత్ర చేశాను. కేవలం ఈ కేరక్టర్ కోసమే 15 కిలోలు బరువు తగ్గాను. నటన, నాట్యం, పోరాటాల విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. రషెస్ చూసినవాళ్లందరూ నా పెర్ఫార్మెన్స్ బాగుందన్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికే హీరోగా మారాను’’అన్నారు. ఆరు నుంచి అరవై ఏళ్ల వారి వరకూ అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. పదికాలాల పాటు గుర్తుంచుకోదగ్గ సినిమాగా దర్శకుడు ఈ సినిమాను మలిచాడని నిర్మాత పేర్కొన్నారు. -
‘ప్రేమా గీమా జాన్తా నయ్’
ప్రేమంటే ఆ కుర్రాడికి అసహ్యం. అందుకే అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. అలాంటి యువకుడు ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హీరోగా ఆర్వీ సుబ్బు దర్శకత్వంలో శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ పాట మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మిగిలిన పాటలను త్వరలో వైజాగ్‌లో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. సెప్టెంబర్ రెండో వారంలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులోని ప్రేమ సన్నివేశాలు సరికొత్తగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేందర్‌రెడ్డి-జగదీష్, ఆర్ట్: కె.వి. రమణ.