తనతో వైఎస్ జగన్ భేటీపై రాష్ట్రపతి ట్వీట్
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని ఆయన ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు.
భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.వైఎస్ జగన్ తో కలిసి రాష్ట్రపతిని కలిసినవారిలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు ఉన్నారు.
A delegation of MPs & leaders of YSR Congress party led by YS Jagan Mohan Reddy called on #PresidentMukherjee today pic.twitter.com/RqGUFrBXXW
— President of India (@RashtrapatiBhvn) February 23, 2016