అట్టుడికిన గూడూరు
చర్చావేదిక భగ్నం
ఇరువైపులా మోహరించిన టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు
అడ్డుకున్న పోలీసులు
గూడూరు : టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో గూడూరు మం డల కేంద్రం ఆదివారం అట్టుడికింది. అవినీ తిపై చర్చకు సిద్ధమంటూ కొద్దిరోజులుగా ఇరుపార్టీల నాయకుల ప్రకటనలతో వేడెక్కుతున్న వాతావరణం చర్చకు నిర్ణయించిన 12వ తేదీన మరింత రాజుకుంది. మండ ల కేంద్రం ఇరుపార్టీల నినాదాలతో హోరెత్తింది. వారిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
వివాదం మొదలైందిలా..
మండల కేంద్రంలో ఈ నెల 6 న జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌పై పలు అవినీతి ఆరోపణలు చేసిన విష యం తెలిసిందే. దీంతో మరుసటి రోజు టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి భరత్కుమార్రెడ్డితోపాటు మండల నాయకులు ఎమ్మెల్యే అనుమతితో ఆమెపై ప్రతి విమర్శలు చేస్తూ పలు ఆరోపణలతో పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మరుసటి రోజు కాంగ్రెస్ మండల నాయకులు శంకర్‌నాయక్‌పై ఆరోపణలు నిరూపిస్తామని.. దమ్ముటే ఈ నెల 12న చర్చకు సిద్ధమా అంటూ ప్రకటించారు. దీంతో తాము చర్చకు సిద్ధమేనంటూ శనివారం స్థానిక మండల నాయకులతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రకటన ఇప్పించారు. దీంతో మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదపులో ఉంచేం దుకు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై అరుణ్‌కుమార్ సిబ్బందితో ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి ఉద్రిక్తత
ఆదివారం ఉదయం నుంచి టీఆర్ఎస్, కాంగ్రె స్ కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఆందోళన చేయాలని, అవసరమైతే ఘర్షణలకు సిద్ధమేనంటూ జెండాలు తొడిగిన కర్రలను రెండు పార్టీల వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గూడూరుకు వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలతో కార్యాలయం నుంచి అంగడి మైదానానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు కాంగ్రెస్ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే కొందరు కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేస్తుం డగా పోలీసులు వారిని వారించారు.
వారు వెళ్లాక.. తామూ అంగడి మైదానం వెళతామం టూ నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఎం డీ ఖాసీం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ దేషిడి మన్మో హన్‌రెడ్డి, కోమాండ్ల రమణారెడ్డి, ఇతర నాయకులు బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. దీంతో వారిని సీఐ వెంకటేశ్వర్రావు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపటి తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి లేకుండా మండల నాయకులతో తనకు చర్చేంటి అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ ఎండీ ఖాసీం విలేకరులతో మాట్లాడుతూ చర్చకు సిద్ధమంటూ పోలీసుల అండతో తమను అడ్డుకోవడం ఎమ్మెల్యేకు తగదన్నారు.