private pictures
-
భర్త అనుకుని వేరే వ్యక్తితో ఛాటింగ్.. ఫొటోలూ పంపింది!
సోషల్ మీడియా ఛాటింగ్‌ల వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటి. అవతల ఉంది భర్తనా? పరాయి పురుషుడా? అనే విషయం కూడా పసిగట్టని ఓ ఇల్లాలు.. తన ప్రైవేట్ ఫొటోలు పంపింది. బ్లాక్‌మెయిలింగ్ ఎదురుకావడంతో చివరకు తల బాదుకుని పోలీసులు ఆశ్రయించింది. ముంబై మలాడ్ దిన్దోషి ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరూ ఓ అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నారు. కొత్తగా ఆమె భర్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాడు. భార్యకి ఫాలో రిక్వెస్ట్ పంపడంతో ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆపై భర్తతో రెగ్యులర్‌గా ఛాట్ చేస్తోంది. ఈ క్రమంలో అతను కోరడంతో ప్రైవేట్ ఫొటోలు సైతం పంపింది. అలా మూడు నెలలు గడిచాయి. తీరా ఓ రోజు.. అదే పనిగా ఫొటోలు పంపాలంటూ భర్త నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఆమె చిరాకు పడడంతో.. ఆ ఫొటోల్ని ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులు వచ్చాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తను ఈ విషయమై నిలదీయడంతో.. అసలు తనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదని చెప్పడంతో భార్య షాక్ తింది. బ్లాక్‌మెయిలింగ్‌పై భర్తతో కలిసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా పక్క ఫ్లాట్‌లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఫొటోల్లో ఒక్కదానిని సేకరించి మరీ.. భర్త పేరిట ప్రొఫైల్ క్రియేట్ చేశాడట నిందితుడు. అందుకే ఆమెకు అనుమానం రాలేదు. నిందితుడి యవ్వారం తెలిసి.. దిన్దోషి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. కిందటి ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో నిందితుడికి, బాధిత కుటుంబానికి ఏవో గొడవలు జరిగాయట. అది మనసులో పెట్టుకునే ఈ వికృత చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. లైంగిక వేధింపులు, సైబర్ వేధిపులు, పరువుకు భంగం కలిగించే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుడికి మార్చి 28వరకు కోర్టు రిమాండ్ విధించింది. -
నటి ఫోన్ హ్యాక్.. ప్రైవేట్ ఫోటోలు లీక్
మొన్న అక్షరా హాసన్.. నిన్న అమీ జాక్సన్.. నేడు హన్సిక మోత్వాని.. ఏంటనుకుంటున్నారా హ్యాకింగ్ బాధితులు. అవును నటి హన్సిక ఫోన్ హ్యాక్ అయ్యింది. దాంతో ఆమె ప్రైవేట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హన్సిక ఫోన్‌ని హ్యాక్ చేసిన వ్యక్తులు ఆమె టూ పీస్ బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు హన్సిక. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘నా ఫోన్, ట్విటర్ అకౌంట్ రెండు హ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్ ఎండ్ టీమ్ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్ ఖాతాలో వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తున్నారు. ఇది హన్సిక నటిస్తున్న 50వ చిత్రం. Phone n Twitter hacked please don’t respond to any random messages . My back end team is working on getting things in control. — Hansika (@ihansika) January 23, 2019 -
నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్ ఫొటోలు
కొచ్చి: ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరణ్ కుమార్ (38) అనే వ్యక్తికి మలయాళంలో ఓ ప్రముఖ నటికి పరిచయం ఉంది. అతడు ఇండస్ట్రీలో ఫిల్మ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేవాడు. తొలుత వారిమధ్య పరిచయం ఉండేది. కాలక్రమంలో అదికాస్త మరింత ఎక్కువై ఇద్దరు సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రైవేట్ సంబంధం కూడా మొదలైంది. ఈ సమయంలోనే అతడు పెళ్లి చేసుకుంటానని కూడా ఆ నటితో చెప్పాడు. అప్పుడే వారు పలు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే, అతడికి అప్పటికే వివాహమయినా ఆమె చెప్పకపోవడం ఆ తర్వాత ఆ నటి తెలుసుకొని అతడు మోసగాడని గుర్తించి దూరం పెట్టింది. అయితే, డబ్బును డిమాండ్ చేస్తూ బెదిరించే క్రమంలో వారిద్దరు కలిసి దిగిన ప్రైవేట్ ఫొటోలను కిరణ్ సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించగా వారు అతడిని నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో అరెస్టు చేశారు. -
ఆ బ్లాక్‌మెయిల్‌పై అశ్వినీ ఏం చేసిందంటే
కేవలం 12 గంటల సమయంలోనే 26 ఏళ్ల తరుణ అశ్వనీ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అనేక కుదుపులకు లోనుచేసింది. తరుణ బలహీనురాలైతే లొంగిపోయేదేమో! నిస్సహాయ స్థితిలో ఏదైనా అఘాయిత్యం చేసుకొనేదేమో.. కానీ తరుణ లొంగిపోలేదు. ఎదురుతిరిగింది. పోరాటానికి సిద్ధపడింది. ఇప్పుడు తరుణ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ముంబైకి చెందిన తరుణ అశ్వనీకి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అని బ్లాక్మెయిల్ చేస్తూ అతను అశ్వినికి మెయిల్ పంపాడు. ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాలని చూశాడు. ఆ వికృత వ్యక్తి బెదిరింపులకు ఆమె లొంగలేదు. అతనికి భయపడి బిక్కుబిక్కుమంటూ గడపలేదు. వెంటనే ఈ బెదిరింపులను బహిరంగపరచాలని ఆమె నిర్ణయించింది. అతని రెండు ఈయిళ్లను స్ర్కీన్‌షాట్స్ తీసి ఆమె తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అందులో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి.. వాటితో బెదిరించాలని చూస్తున్నాడని, కానీ, అతని బెదిరింపులకు లొంగకుండా.. ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించినట్టు ఆమె తన పోస్టులో పెట్టారు. తాను ఇలా చేయడం వల్ల ఇలాంటి బెదిరింపుల బారిన పడిన మహిళల భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చేందుకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. సైబర్ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. కొంతమంది అలాంటి ఫొటోలను ఎందుకు నీ బాయ్‌ఫ్రెండ్‌కు పంపావని ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ ఈ విమర్శలను కొట్టిపారేసింది. ఆమె ప్రియుడు, పోలాండ్ జాతీయుడైన స్టాస్ ఈస్ట్కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టారు. ’భారతీయ సంప్రదాయవాదులు తరుణను తప్పుబడుతున్నారు. తమ భాగస్వామికి అలాంటి ఫొటోలు తీసి పంపడాన్ని తప్పుబడుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి అసహజం ఏమీ కాదు. ఇద్దరు యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో చేసుకొనే ఇలాంటివి వ్యక్తిగత ప్రైవసీలోభాగంగా చూడాలి’ అని ఆయన చెప్పారు. ఇక ముంబైకి చెందిన తరుణ గత ఐదు నెలలుగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటూ.. ఫిజికల్ థెరపీ నిపుణురాలిగా కొనసాగుతోంది. తనకు ఆన్లైన్ బెదిరింపులు రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు, ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.