Priya Singh Paul
-
'ఇందు సర్కార్ రిలీజ్‌పై స్టే ఇవ్వండి'
బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ నేపథ్యంలో రూపొందిన 'ఇందు సర్కార్' చిత్రం విడుదలపై ప్రియా సింగ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ముంబై హైకోర్టు ప్రియా వాదనను తోసి పుచ్చటంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంజయ్‌గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ట్రయిలర్ ఉందని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది. ఇటీవల.. ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్ పాల్ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 12 కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ముంబై హైకోర్టు సైతం స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారమే ఈనెల 28న 'ఇందు సర్కార్' ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు. కానీ మరోసారి ప్రియా సింగ్ పాల్ కోర్టును ఆశ్రయించటంతో ఇందు సర్కార్ రిలీజ్ పై చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. -
సంజయ్ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్ పాల్
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్ పాల్ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. విడుదలకు సిద్దమైన హిందీ సినిమా ‘ఇందూ సర్కార్’లో తన తండ్రి, ఇందిరాగాంధీల చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపిస్తూ 48ఏళ్ల ప్రియాసింగ్ సోమవారం మీడియా ముందుకొచ్చారు. సినిమాలో 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని, అబద్దాలనే నిజాలు అనుకునేలా సినిమాలో చూపించారని ఆమె ఆరోపించారు. సినిమా దర్శకుడికి లీగల్ నోటీసులు సైతం పంపానన్నారు. పసికందుగా ఉన్న తనను షీలా సింగ్, బల్వంద్ పాల్ దంపతులు దత్తత తీసుకున్నారని చెప్పారు. పెళ్లికాకముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని తన పెంపుడు తల్లితండ్రులు చెప్పారన్నారు.