సంజయ్‌ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్‌ పాల్‌ | Woman claiming to be Sanjay Gandhi's daughter slams 'Indu Sarkar' | Sakshi
Sakshi News home page

సంజయ్‌ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్‌ పాల్‌

Jul 11 2017 1:05 AM | Updated on Sep 5 2017 3:42 PM

సంజయ్‌ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్‌ పాల్‌

సంజయ్‌ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్‌ పాల్‌

ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్‌ నేత సంజయ్‌ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్‌ పాల్‌ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది.

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్‌ నేత సంజయ్‌ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్‌ పాల్‌ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. విడుదలకు సిద్దమైన హిందీ సినిమా ‘ఇందూ సర్కార్‌’లో తన తండ్రి, ఇందిరాగాంధీల చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపిస్తూ 48ఏళ్ల ప్రియాసింగ్‌ సోమవారం మీడియా ముందుకొచ్చారు.

సినిమాలో 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని, అబద్దాలనే నిజాలు అనుకునేలా సినిమాలో చూపించారని ఆమె ఆరోపించారు. సినిమా దర్శకుడికి లీగల్‌ నోటీసులు సైతం పంపానన్నారు. పసికందుగా ఉన్న తనను షీలా సింగ్, బల్వంద్‌ పాల్‌ దంపతులు దత్తత తీసుకున్నారని చెప్పారు. పెళ్లికాకముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని తన పెంపుడు తల్లితండ్రులు చెప్పారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement