అమలాపురం ఆర్డీఓ ప్రియాంక బదిలీ
అమలాపురం :అమలాపురం ఆర్డీఓ సీహెచ్.ప్రియాంక బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ కలెక్టర్గా ఆమెను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ కలెక్టర్గా వెళుతున్న ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం స్పెషల్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అధికారుల ప్రశంసలు
వారం పదిరోజులుగా ఆర్డీఓ బదిలీపై జోరుగా ఊహాగానాలు వినిపించిన క్రమంలో ఆమె బదిలీపై రెవెన్యూ అధికారులు పెద్దగా ఆశ్చర్చపోవడంలేదు. గత ఏడాది పైలీన్ తుపాను సమయంలో ఆమె ఇక్కడ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. కోనసీమను అతలాకుతలం చేసిన హెలెన్ తుపాను సమయంలో - మిగతా 2లోఠ
అనుభవం లేకపోయినా సమర్ధవంతంగా పనిచేశారు. అనంతరం వచ్చిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రెండు నెలల క్రితం ఐఏఎస్ అధికారి కర్నన్ను వివాహం చేసుకున్నారు.
కొత్త ఆర్డీవోగా గణేష్కుమార్
ప్రియాంక స్థానంలో శ్రీకాకుళం ఆర్డీఓ జి.గణేష్కుమార్ బదిలీపై ఇక్కడకు రానున్నారు. అంతకుముందు రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా, కడప ఉప ఎన్నికల నిర్వహణాధికారిగా పనిచేసిన గణేష్కుమార్ 2009లో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై గ్రూప్-1 అధికారిగా నియమితులయ్యారు. శ్రీకాకుళం ఆర్డీవోగా పలు భూవివాదాలు పరిష్కరించారనే పేరుంది.
సవాళ్లు... సంతృప్తి
ఆర్డీఓగా తొలిపోస్టింగ్ అమలాపురంలో రావడంతో మొదట్లో కంగారు పడ్డాను. అమలాపురం లాంటి చోట పనిచేయడం ఏ అధికారికైనా సవాలే. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండు తుపానుల ఎదుర్కొనాల్సి వచ్చింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అతి సమస్యాత్మక మత్స్యకార గ్రామాల్లో సైతం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించగలగడం పూర్తి సంతృప్తినిచ్చింది.
- సీహెచ్.ప్రియాంక