Pro Kabaddi Premier League
-
దబంగ్ ఢిల్లీపై బెంగాల్ విజయం..
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్ తరఫున నితిన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ అషు మలిక్ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 34–30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్ నందల్, మోహిత్ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ తరఫున ఫజల్ అత్రచి, పార్తీక్ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్ చేయగా, దీపక్ సింగ్ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్లో 101 మ్యాచ్‌లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. చదవండి: IND vs ENG: అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్ -
యూపీ యోధ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ పాయింట్ తేడాతో గట్టెక్కింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో యూపీ యోధ 30–29 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యోధ జట్టులో శ్రీకాంత్ జాదవ్ (8), ప్రశాంత్ (8), సచిన్ (6) రాణించారు. హరియాణా తరఫున మోను గోయట్ (11), వికాస్ (7) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 37–33తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో మిరాజ్ షేక్ 9, నవీన్ కుమార్ 8 పాయింట్లు చేశారు. తలైవాస్ జట్టులో అజయ్ ఠాకూర్ (14) రాణించగా... సుకేశ్, అతుల్ చెరో 5 పాయింట్లు సాధించారు. శుక్రవారం నుంచి మ్యాచ్‌లు వైజాగ్‌లో జరుగనున్నాయి. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
ముంబను నిలువరించిన టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు మీదున్న యు ముంబ జట్టును తెలుగు టైటాన్స్ నిలువరించింది. ఆదివారం పోర్ట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో 44-43 తేడాతో టైటాన్స్ విజయం దక్కించుకుంది. రాహుల్ రైడింగ్‌కు యుముంబ ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏకంగా తను 22 రైడ్ పాయింట్లు సాధించాడు. తొలి అర్ధభాగం మరో నిమిషంలో ముగుస్తుందనగా నలుగుర్ని అవుట్ చేయడంతో జట్టు 22-15 ఆధిక్యం సాధించింది. ఆట ముగిసేందుకు ఐదు నిమిషాల గడువు ఉందనగా టైటాన్స్ ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి లోనా సాధించింది. యు ముంబలో అనూప్, పవన్‌లు 13 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 52-30 తేడాతో పాట్నా పెరైట్స్ విజయం సాధించింది.