ముంబను నిలువరించిన టైటాన్స్ | U Mumba lock horns with Telugu Titans in the Pro Kabaddi League | Sakshi
Sakshi News home page

ముంబను నిలువరించిన టైటాన్స్

Published Mon, Aug 18 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

ముంబను నిలువరించిన టైటాన్స్

ముంబను నిలువరించిన టైటాన్స్

సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు మీదున్న యు ముంబ జట్టును తెలుగు టైటాన్స్ నిలువరించింది. ఆదివారం పోర్ట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో 44-43 తేడాతో  టైటాన్స్ విజయం దక్కించుకుంది. రాహుల్ రైడింగ్‌కు యుముంబ ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏకంగా తను 22 రైడ్ పాయింట్లు సాధించాడు.
 
తొలి అర్ధభాగం మరో నిమిషంలో ముగుస్తుందనగా నలుగుర్ని అవుట్ చేయడంతో జట్టు 22-15 ఆధిక్యం సాధించింది. ఆట ముగిసేందుకు ఐదు నిమిషాల గడువు ఉందనగా టైటాన్స్ ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి లోనా సాధించింది. యు ముంబలో అనూప్, పవన్‌లు 13 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 52-30 తేడాతో పాట్నా పెరైట్స్ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement