Producer Suresh Babu
-
దగ్గుబాటి అభిరామ్‌కు బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. అతడి సెల్‌ఫోన్‌ను తస్కరించిన నలుగురు దుండగులు అందులో ఉన్న ‘ఆ ఫొటోలు’బయట పెడతామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. అవి బయటపెట్టకుండా ఉండా లంటే రూ.1.5 కోట్లు చెల్లించాలంటూ ఈ–మెయిల్ పెట్టారు. సురేశ్‌బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఫోన్ తస్కరించి.. మెయిల్ చేసి.. అభిరామ్‌తో ఓ మహిళ సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనించిన నలుగురు యువకులు అభిరామ్ ఫోన్‌ను తస్కరించాలని పథకం వేశారు. అందులో ఉన్న అంశాలను క్యాష్ చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే గత నెలలో అభిరామ్ ఓ రెస్టారెంట్లో ఉన్న సమయంలో అతడి ఐఫోన్‌ను తస్కరించారు. దాని పాస్‌వర్డ్‌ను క్రాక్ చేసిన దుండగులు అందులో ఉన్న ఫొటోలు, వీడియోల్లో ‘కొన్నింటిని’చూశారు. వీటిని అడ్డం పెట్టుకుని అభిరామ్, సురేశ్‌బాబు నుంచి డబ్బు గుంజడానికి నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఈ–మెయిల్ ఐడీని క్రియేట్ చేసి, దాని నుంచి గత నెల 24న అభిరామ్‌కు మెయిల్ పంపారు. అందులో ‘ఆ ఫొటోలు, వీడియోల’విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అవి బయటపెట్టకుండా ఉండాలంటే తమకు రూ.1.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ–మెయిల్ చూసి కంగుతిన్న సురేశ్‌బాబు గత నెల్లో నగర పోలీసు కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బాధ్యులుగా గుర్తించిన కె.రఘురామవర్మ(పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన నిరుద్యోగి), ఎన్.కార్తీక్(పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిరుద్యోగి), తిరుమలశెట్టి నాగవెంకటసాయి(కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్మే నేలమర్రు వాసి), పి.చంద్రకిషోర్(చింతల్లో ఉండే పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి)లను అరెస్టు చేశారు. సాయి, కిషోర్ అభిరామ్ ఫోన్ తస్కరించి మిగిలిన వారికి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఏ ఫొటోలు, వీడియోల పేర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేశారనేది గోప్యంగా ఉంచారు. -
ఇక సినిమాలు ప్రదర్శించుకోవచ్చు
‘‘ఈ బిజినెస్ విధానంలోనే స్టార్టింగ్ నుంచి లోపాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరం చిన్న చిన్న తప్పులు చేశాం. ఈ చిన్న తప్పులే పెద్దవయ్యాయి. ఇనిషియల్ స్టేజెస్‌లో జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలు కాలేదు. ప్రాబ్లమ్ పెద్దది కావడం వల్లే థియేటర్స్‌ను క్లోజ్ చేయాలనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మాకెవ్వరికీ షూటింగ్స్ ఆపాలని, థియేటర్స్‌ను క్లోజ్ చేయాలని లేదు. మాకు ప్రతిరోజు ప్రేక్షకులను ఎలా థియేటర్స్‌కు రప్పించాలని, ఎక్కువ సినిమాల షూటింగ్ ఎలా చేయాలి? అని మాత్రమే ఉంటుంది’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు. విజువల్ ప్రింటింగ్ ఫీజు విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఇండస్ట్రీ జాయింట్ యాక్షన్ కమిటీకి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. ఈ నెల 9 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ప్రదర్శన కొనసాగనుంది. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్లో బుధవారం రాత్రి జరిగిన పాత్రికేయుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘వీలున్నవాళ్లు గురువారమే సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. 7–10డేస్‌లో ఫైనల్ రేట్కార్డ్స్ని ఫైనలైజ్ చేస్తాం. క్యూబ్, యూఎఫ్‌ఓకి సెపరేట్ రేట్స్ ఉండేవి.ఇప్పుడు ఓ రేట్ కార్డ్ సెట్ చేశాం. ఇవన్నీ ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి వస్తాయి. ఆల్ ఇండస్ట్రీ మెంబర్స్ ప్రపోజల్స్‌ను పరిశీలించాం. కొందరికి మరికొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని కూడా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి పంపించాం. ప్రస్తుతం యూఎఫ్ఓ, క్యూబ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ప్రపోజల్స్ చేశాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పందాల మేరకు సైన్ చేశాయి. మిగతా రాష్ట్రం వాళ్లు కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ల పోరాటాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్ణాటక వాళ్లు 9 నుంచి సినిమాలు బంద్ చేస్తున్నాం అన్నారు. తమిళ వాళ్లు కంటెంట్ ఇవ్వటం ఆపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మేం ఇప్పుడు చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఈ వారం రోజుల లాభనష్టాల బేరీజు పక్కన పెడితే అందరికీ ఒక అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ ఆలోచించడానికి అవకాశం వచ్చింది.డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్వారితో చర్చలు జరిపిన తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. మేం అర్థం చేసుకున్నాం. మేం చెప్పిన విషయాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. మా డిమాండ్స్ తీర్చాలంటే కంపెనీలు మూసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతవరకు చేయగలిగాం. వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా చేయగలం. ఫైనల్‌గా అందరికీ మంచి జరిగేలా చూస్తాం’’ అన్నారు. -
అతని కమిట్మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు
‘‘దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ టీం పక్కాగా కథ తయారు చేసుకుని ప్లానింగ్‌గా వెళ్లడంతో ‘పెళ్లి చూపులు’ వంటి మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ చిత్రం నాకు నచ్చడంతో రిలీజ్లో నేను కూడా భాగస్వామినయ్యా. తరుణ్ గతంలో నన్ను కలిసినప్పుడు నేనో చిత్రం చేయమంటే తను మాత్రం ఈ చిత్రానికే ఫిక్స్ అయిపోయి నా సినిమా చేయనన్నాడు. తన కమిట్మెంట్ నచ్చింది. త్వరలో తనతో మా బ్యానర్లో ఓ సినిమా చేస్తా’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రాగినేని నిర్మించిన ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో తెరకెక్కించేందుకు ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. ప్రొడక్షన్ మైండ్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడంతో ఎక్కడా ఇబ్బందులు రాలేదు. ఈ చిత్రాన్ని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఆరు నుంచి అరవై ఏళ్ల వ యసు వారందరూ చూడదగ్గ చిత్రమిది. గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. వివేక్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలెట్’’ అని పేర్కొన్నారు. విజయ్, రీతూవర్మ, దర్శకుడు ‘మధుర’ శ్రీధర్, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు.