నేటి విజయమ్మ పర్యటన వివరాలు
సాక్షి, కడప ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జనభేరి ఎన్నికల ప్రచారం శుక్రవారం నాడు ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరులలో నిర్వహించనున్నట్లు ఆపార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటలకు ఎర్రగుంట్లలో విజయమ్మ రోడ్డు షో చేపట్టనున్నారు. అనంతరం 11.00 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని స్థానికంగా రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. 3.00 గంటలకు జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలోనూ, 6.00 గంటలకు ముద్దనూరులో రోడ్డు షో నిర్వహించనున్నట్లు శివశంకరరెడ్డి తెలిపారు. పర్యటనను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.