పిల్లల్ని చంపొద్దు: హీరో శ్రీకాంత్
హైదరాబాద్: జీవితంలో కష్టసుఖాలు పగలు, రాత్రి లాంటివని హీరో శ్రీకాంత్ అన్నారు. సంసార జీవితంలో సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొవాలని, ఆత్మహత్యకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జీవితం చాలా చిన్నదని, మనస్పర్థలతో దాన్ని పాడుచేసుకోవద్దని 'సాక్షి' టీవీ చిట్‌చాట్ లో చెప్పారు.
ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తనను ఎంతోగానే కదిలించిందని అన్నారు. ఇది చాలా బాధకరమన్నారు. ముద్దులొలికే చిన్నారులను కన్నతండ్రే కడతేర్చడం దారుణమన్నారు. ఇలాంటివి ఇకపై పునరావృతం కాకూడదన్నారు. పెద్దల పంతాలకు పిల్లలను బలిచేయొద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.