properties confiscation
-
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఇవ్వాలని 2012లో బాల్కొండ ప్రాంత రైతాంగం కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం కింద బాధితులకు రూ.62,85,180 చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే అధికారులు 51,13,350 మాత్రమే జమ చేశారు. దీంతో రైతులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. చదవండి: (వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాలలో ఓ సంచలనం: భట్టి) -
ఇక మావోయిస్టుల ఆస్తులు సీజ్!!
మావోయిస్టుల ఆస్తులను ఇక సీజ్ చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి తెలిపారు. మొత్తం 47 మంది ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 9 మంది విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అమీర్ సుభానీ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడినట్లు ఆయన చెప్పారు. రెండు నెలల క్రితం దేశంలోనే తొలిసారిగా బీహార్ ప్రభుత్వం ఆరుగురు మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసి బీహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. దీంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నింటిలోనూ ఇలాంటి చర్యలే చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అందరికీ తెలిపింది. మావోయిస్టు అగ్రనాయకుల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు సేకరించి, వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాలని చెప్పింది. ముఖ్యమంత్రుల సమావేశంలో బీహార్ సీఎం నితిష్ కుమార్ ఈవిషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్కు వివరించారు.