the prosecution
-
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రేమ
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ప్రేమను వైద్యులు శనివారం డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 15న ఆమె తన భర్త సురేష్‌తోపాటు కుమారుడు సుచిలను హత్య చేసిన విషయం తెలిసిందే. మరో కుమారుడు సుమేష్ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆమెతోపాటు కుమారుడు సుప్రీమ్ కూడా డిశ్చార్జ్ అయ్యాడు. కేరళ నుంచి వచ్చిన ప్రేమ బంధువులు సుప్రీమ్‌ను తీసుకొని వెళ్లారు. కాగా జంట హత్యల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఆమెను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
వరకట్న హత్య కేసులో పదేళ్ల జైలు
ఖమ్మం లీగల్: వరకట్న హత్య కేసులో ఓ యువకునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువేల రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం... ఖమ్మంలోని మంచికంటి నగర్‌కు చెందిన పర్వీన్‌కు, బొక్కలగడ్డకు చెందిన సయ్యద్ గౌస్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. కట్నం కింద లక్షన్నర రూపాయలు, బంగారు ఆభరణాలు, ఇంటి సామాన్లను పర్వీన్ తల్లిదండ్రులు ఇచ్చారు. వివాహనంతరం ఆరు నెలలపాటు గౌస్, పర్వీన్ దంపతుల కాపురం సంతోషంగా సాగింది. ఆ తరువాత నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యూరుు. పిల్లలు పుట్టడం లేదంటూ ఆమెను భర్త గౌస్, అతని తల్లితండ్రులు వేధించసాగారు. ఆమె శీలాన్ని కూడా శంకించారు. అధిక కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి కూడా వెళ్లగొట్టారు. దీంతో, 2013 మార్చి 17న ఖమ్మంలోని మహిళ పోలీస్‌స్టేషన్‌లో పర్వీన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్కడ కూడా.. తనకు విడాకులు ఇవ్వాలని పర్వీన్‌ను గౌస్ కోరాడు. 2013 ఏప్రిల్ 28న పర్వీన్ తన భర్త ఇంటికి వెళ్లింది. ఆమెను భర్త, అతని కుటుంబీకులు ఇంట్లోకి అనుమతించలేదు. ఆమె ఎంతగా బతిమిలాడినా కనికరించలేదు. చివరికి ఆమె అదే రోజు సాయంత్రం తన పుట్టింటికి వెళ్లిపోరుు, స్నానాల గదిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె తీవ్ర గాయూలతో 2013 మే 5న ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందింది. ఆమె తల్లి షేక్ గౌసియాబేగం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్ గురువారం తీర్పునిచ్చారు. మొదటి నిందితుడైన పర్వీన్ భర్త సయ్యద్ గౌస్(27)పై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించారు. పర్వీన్‌ను వేధించినందుకుగాను మరో మూడేళ్ల జైలు శిక్ష, మూడువేల రూపాయల జరిమాన విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. నేరం రుజువు కానందున మరో ముగ్గురు నిందితులు సయ్యద్ జహీరాబీ, సయ్యద్ చాంద్, సయ్యద్ షాహనాజ్‌ను విడుదల చేశారు. ప్రాసిక్యూషన్‌తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.అంజయ్య వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మోహన్‌రావు, కోర్టు కానిస్టేబుళ్లు రామారావు, ఖాజామియా, హోంగార్డులు సయ్యద్ యూసుఫ్, చిట్టిబాబు సహకరించారు. -
భార్యను కడతేర్చిన భర్తకు యావజ్జీవ శిక్ష
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను మానసికంగా, శారీరకంగా వేధించి చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని పసరుగొండ గ్రామానికి చెం దిన మంద లక్ష్మీనారాయణ రెండో కూతురు చామంతి(26)ని 2006 సంవత్సరంలో హసన్‌పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన తోట కోటికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా చామంతి తల్లిదండ్రులు కట్నకానుకల కింద కోటికి రెండెకరాల భూమి, రూ. లక్ష నగదుతోపాటు ఇతర వస్తువులు ఇచ్చా రు. అయితే పెళ్లి అయిన తర్వాత వీరికి సం తానం కలుగలేదు. దీంతో తనకు కట్నంగా ఇచ్చిన రెండెకరాల భూమిని అమ్మి డబ్బులు తీసుకరావాలని కోటి తన భార్య చామంతిని వేధించేవాడు. ఈ క్రమంలో 2011 సెప్టెంబర్ లో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు రూ. 4 లక్షలను పెద్దల సమక్షంలో లక్ష్మీనారాయణ తన అల్లుడు కోటికి ఇచ్చాడు. అయితే గతం లో చేసిన అప్పులను భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో కొంత తీర్చి, మిగతా దాంతో జల్సాలు చేశాడు. అనంతరం తనకు మరో రూ. 2 లక్షలు కావాలని చామంతిని భ ర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ ఆమె భర్త వేధించేవారు. దీంతో చామంతి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పుకోవడంతో తండ్రి లక్ష్మీనారాయణ మళ్లీ రూ. 50 వేల నగ దు అల్లుడికి ఇచ్చాడు. అయితే తమ కొడుకు రూ.2 లక్షలు అడిగితే నువ్వు రూ. 50వేలే ఇచ్చావని.. నీబిడ్డ ఎలా బతికి బట్టకడుతుందో.. చూస్తామని.. అదేరోజు చామంతి ఆడబిడ్డ, ఆమె భర్త.. లక్ష్మీనారాయణను బెదిరించారు. ఈ క్రమంలో 2012 మార్చి 21న అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త కోటితోపాటు అత్తమామలు శశిరేఖ, రెడ్డయ్య లు కలిసి చామంతి పడుకున్న ఇంట్లోకి వెళ్లి సుత్తెతో ఆమె తల, మెడపైన విపరీతంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అయితే తాము చేసిన హత్య బయటకు రాకుండా ఉండేందుకు వారు ఇంటి వెనకాల ఉన్న చేదబావిలో చామంతి మృతదేహాన్ని పడవేశారు. అనంతరం చామంతి ఆడబిడ్డ భర్త భూతం సుధాకర్ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ ద్వారా చామంతి తల్లిదండ్రులకు మీ బిడ్డ చనిపోయిందని సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటినా అక్కడికి వెళ్లారు. అయితే తమ అల్లు డు, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త కలిసి తమ కూతురిని హత్య చేశారని మృతురాలి తండ్రి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు కోటిపై వరకట్న వేధిం పులు, హత్యానేరం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏడుగురు సాక్ష్యాలను విచారించిన అనంతరం నేరం రుజువుకావడంతో తోట కోటికి యావజ్జీవ జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధిస్తూ జడ్జి రేణుక తీర్పు చెప్పారు. కాగా, కేసు పరిశోధనను సీఐ డి.చంద్రయ్య చేయగా, ఇన్స్పెక్టర్ రమేష్‌బా బు, హెడ్ కానిస్టేబుల్ నారాయణదాసు నిం దితులను కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే ప్రాసిక్యూషన్ పక్షాన విచారణను పర్యవేక్షిం చగా, అదనపు పీపీ విజయాదేవి వాదించా రు. కాగా, సాక్షులను కానిస్టేబుళ్లు టి.కృష్ణ, బి.ఈశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు. -
నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు
గాజువాక, న్యూస్‌లైన్ : లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయని యువతిని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 అపరాధ రుసుం విధిస్తూ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.దత్తాత్రేయులు సోమవారం తీర్పు చెప్పారు. మిలియన్ పౌండ్లు లాటరీలో వచ్చాయని 47వ వార్డు ములగాడ హౌసింగ్‌కాలనీకి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని లండా రమాదేవికి నైజీరియాకు చెందిన ఫ్రిడో అంబ్రోస్ గత ఏడాది మేలో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం పంపించాడు. ఆమె వారిని ఫోన్లో సంప్రదించగా ఆ డబ్బును విడుదల చేయడం కోసం రూ.21 వేలు అవసరమని అకౌంట్ నంబర్ ద్వారా వసూలు చేశాడు. లాటరీ డబ్బు అధిక మొత్తంలో ఉందని దాన్ని ఇండియన్ కరెన్సీకి మార్చడం కోసం అదనంగా రూ.2.10 లక్షలు చెల్లించాలని మరో అకౌంట్ నంబర్ ఇచ్చాడు. ఆమె అదే రోజు రూ.50 వేలు, మరుసటిరోజు రూ.1.60 లక్షలు వేరొక అకౌంట్ నంబర్‌కు పంపింది. మళ్లీ రూ.9 లక్షలు చెల్లించాలని యువతికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. విసుగెత్తిన యువతి తనకు లాటరీ సొమ్ము వద్దని, తాను చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. తాను బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఇంటికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పడంతో అతడు జూన్ 12న ఇంటికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కుటుంబ సభ్యులు అతడిని బంధించి గాజువాక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. కేసును సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వరరావు విచారించగా, నకిలీ పాస్‌పోర్టుపై అతడు భారత్‌కు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ వాదనలు అనంతరం నిందితునికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ కేసు వాదించారు.