వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను మానసికంగా, శారీరకంగా వేధించి చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని పసరుగొండ గ్రామానికి చెం దిన మంద లక్ష్మీనారాయణ రెండో కూతురు చామంతి(26)ని 2006 సంవత్సరంలో హసన్‌పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన తోట కోటికి ఇచ్చి పెళ్లి చేశారు.
ఈ సందర్భంగా చామంతి తల్లిదండ్రులు కట్నకానుకల కింద కోటికి రెండెకరాల భూమి, రూ. లక్ష నగదుతోపాటు ఇతర వస్తువులు ఇచ్చా రు. అయితే పెళ్లి అయిన తర్వాత వీరికి సం తానం కలుగలేదు. దీంతో తనకు కట్నంగా ఇచ్చిన రెండెకరాల భూమిని అమ్మి డబ్బులు తీసుకరావాలని కోటి తన భార్య చామంతిని వేధించేవాడు.
ఈ క్రమంలో 2011 సెప్టెంబర్ లో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు రూ. 4 లక్షలను పెద్దల సమక్షంలో లక్ష్మీనారాయణ తన అల్లుడు కోటికి ఇచ్చాడు. అయితే గతం లో చేసిన అప్పులను భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో కొంత తీర్చి, మిగతా దాంతో జల్సాలు చేశాడు. అనంతరం తనకు మరో రూ. 2 లక్షలు కావాలని చామంతిని భ ర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ ఆమె భర్త వేధించేవారు. దీంతో చామంతి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పుకోవడంతో తండ్రి లక్ష్మీనారాయణ మళ్లీ రూ. 50 వేల నగ దు అల్లుడికి ఇచ్చాడు.
అయితే తమ కొడుకు రూ.2 లక్షలు అడిగితే నువ్వు రూ. 50వేలే ఇచ్చావని.. నీబిడ్డ ఎలా బతికి బట్టకడుతుందో.. చూస్తామని.. అదేరోజు చామంతి ఆడబిడ్డ, ఆమె భర్త.. లక్ష్మీనారాయణను బెదిరించారు. ఈ క్రమంలో 2012 మార్చి 21న అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త కోటితోపాటు అత్తమామలు శశిరేఖ, రెడ్డయ్య లు కలిసి చామంతి పడుకున్న ఇంట్లోకి వెళ్లి సుత్తెతో ఆమె తల, మెడపైన విపరీతంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
అయితే తాము చేసిన హత్య బయటకు రాకుండా ఉండేందుకు వారు ఇంటి వెనకాల ఉన్న చేదబావిలో చామంతి మృతదేహాన్ని పడవేశారు. అనంతరం చామంతి ఆడబిడ్డ భర్త భూతం సుధాకర్ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ ద్వారా చామంతి తల్లిదండ్రులకు మీ బిడ్డ చనిపోయిందని సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటినా అక్కడికి వెళ్లారు. అయితే తమ అల్లు డు, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త కలిసి తమ కూతురిని హత్య చేశారని మృతురాలి తండ్రి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు కోటిపై వరకట్న వేధిం పులు, హత్యానేరం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏడుగురు సాక్ష్యాలను విచారించిన అనంతరం నేరం రుజువుకావడంతో తోట కోటికి యావజ్జీవ జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధిస్తూ జడ్జి రేణుక తీర్పు చెప్పారు. కాగా, కేసు పరిశోధనను సీఐ డి.చంద్రయ్య చేయగా, ఇన్‌స్పెక్టర్ రమేష్‌బా బు, హెడ్ కానిస్టేబుల్ నారాయణదాసు నిం దితులను కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే ప్రాసిక్యూషన్ పక్షాన విచారణను పర్యవేక్షిం చగా, అదనపు పీపీ విజయాదేవి వాదించా రు. కాగా, సాక్షులను కానిస్టేబుళ్లు టి.కృష్ణ, బి.ఈశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు.
భార్యను కడతేర్చిన భర్తకు యావజ్జీవ శిక్ష
Published Thu, Aug 28 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement