Sentenced to life imprisonment
-
ఆశారాం బాపుకు జీవిత ఖైదు
-
2వేల బెదిరింపు లేఖలు, వందల ఫోన్ కాల్స్
జోథ్‌పూర్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై నమోదైన రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధకారి అజయ్ పాల్ లంబా ఎదుర్కొన్న సవాళ్లివి. ఆశారాంపై రేప్ కేసును విచారిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు, శిష్యులు తననకు బెదిరింపులు వెల్లువెత్తాయని, బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌తో తనను భయపెట్టాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు. మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో జోథ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆశారాంను దోషిగా తేల్చి.. ఆయనకు జీవితఖైదు విధించింది. తన కెరీర్లోనే అత్యంత హైప్రొఫైల్ కేసు ఇదని ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లంబా తెలిపారు. 2013 ఆగస్టు 20న తనకు ఈ కేసును అప్పగించారని, అప్పటికే ఈ కేసుపై మీడియా ఫోకస్ తీవ్రంగా ఉందని, పలువురు సాక్షులు హత్యకు గురయ్యారని, దీనికి తోడు ఆశారాం శిష్యుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెదిరింపులు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అజయ్‌పాల్ జోథ్‌పూర్ వెస్ట్ డీసీపీగా ఉండేవారు. ‘లేఖల్లో తీవ్రమైన దూషణలు ఉండేవి. ఆశారాంకు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని హెచ్చరించేవారు. నా ఫోన్ నిరంతరం మోగుతూనే ఉండేది. దీంతో గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తేవాడిని కాదు. నేను ఉదయ్‌పూర్‌కు మారిన తర్వాత బెదిరింపు లేఖలు ఆగిపోయాయి’ అని 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతుర్ని కొంతకాలం పాఠశాలకు పంపలేదని, తన భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఎస్పీగా జోథ్‌పూర్‌లో నివాసముంటున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే.. కేసుకు సంబంధించిన సాక్షిని తానే చంపానని ఒప్పుకున్నాడని, అంతేకాకుండా మరో అప్పడి జోథ్‌పూర్ డీఎస్పీ చంచల్ మిశ్రాను కూడా చంపేందుకు టార్గెట్ చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన పదివారాల్లోనే మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశామని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, అయితే, కేసులోని చిక్కుముడుల వల్లే దర్యాప్తు కొంత జాప్యమైందని ఆయన తెలిపారు. -
ఆశారాం బాపుకు శిక్ష ఖరారు
జోధ్‌పూర్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్ ట్రయిల్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది. దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. దోషులుగా తేలిన ఇద్దరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
కామాంధుడికి కటకటాలు
కోరిక తీర్చలేదని నిప్పంటించాడు రెండు రోజుల తర్వాత వివాహిత మృతి కేసులో కీలకమైన హతురాలి కుమారుడి సాక్ష్యం ముద్దాయికి జీవిత ఖైదు, రూ.500 జరిమానా గుత్తి : ఓ వివాహితపై కామాంధుడు కన్నేశాడు..కామ వాంఛ తీర్చాలని రోజూ వేధిస్తుండేవాడు. ఆమె అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు..ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగులబెట్టాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రం యాడికిలోని ఎస్సీ కాలనీలో నివాసముండే వివాహిత ఆదిలక్ష్మి (27)పై ఇదే గ్రామానికి చెందిన రాజశేఖర్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 2014 డిసెంబర్ 31న రాత్రి పది గంటల సమయంలో ఆదిలక్ష్మి తన ఇంటి ముందు నూతన సంవత్సరం ముగ్గు వేస్తుండగా రాజశేఖర్ ఆమె వద్దకు వెళ్లాడు. తన కోరిక ఈ రోజైనా తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఆమె అతని బారి నుంచి తప్పించుకుని ఇంటిలోకి వెళ్లింది. తలుపులు వేసి గడియ పెట్టే సమయంలో అతను లోనికి దూసుకొచ్చాడు. బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది.రాజశేఖర్ కోపోద్రిక్తుడై ఆదిలక్ష్మి ఒంటిపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. ఏడేళ్ల కుమారుడు, చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. చనిపోవడానికి ముందే ఏం జరిగిందో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆదిలక్ష్మి భర్త హుసేని యాడికి పోలీసు స్టేషన్లో రాజశేఖర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు పలు విచారణల అనంతరం శుక్రవారం గుత్తి ఏడీజే కోర్టులో తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో రాజశేఖర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరినామా విధిస్తూ ఏడీజే వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. హతురాలి కుమారుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారింది. ప్రాసిక్యూషన్ తరఫున ఎంవీ మహేష్ కుమార్ వాదించారు. -
రూ.500 కోసం గొడవ..జీవితకాలం శిక్ష
-రూ. 2000 జరిమానా.. -వికారాబాద్ కోర్టులో వెలువడిన తీర్పు పరిగి: రూ. 500 ల కోసం పెట్టుకున్న గొడవ ఓ యువకుడిని జీవితాంతం జైలుకే పరిమితం చేసింది. యువకుడికి శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలవరించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సెషన్స్ కోర్టులో జిల్లా అడిషనల్ సెషన్ జడ్జ్ కే.రంగారావ్ ఈ శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు.. జిల్లాలోని పరిగి మండల పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన పిచ్చకుంట్ల మల్లేశ్(25) తనకు ఇవ్వాల్సిన రూ.500 అప్పు తీర్చాలంటూ అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల హన్మంతుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో చెలరేగిన గొడవలో మల్లేశ్ హన్మంతును కత్తితో పొడవగా అతను మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2011 ఆగస్టు 10వ తేదీ కేసు నమోదు చేసుకుని, అప్పటి సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ రాజయ్యలు దర్యాప్తు ప్రారంభించారు. చార్జిషీట్ దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా కేసుకు సంబందించి ట్రాయల్స్ జరగగా వాదనలు ముగిసి నేరం రుజువు కావటంతో గురువారం తీర్పును వెలువరించారు. మల్లేశ్ కు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
పప్పు కలానీకి జీవితఖైదు
సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్ మాజీ ఎమ్మెల్యే పప్పు కలానీకి సెషన్స్ కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది. ఉల్లాస్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కలానీపై సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు కోర్టు తీర్పు వెలువరించడంతో అతని రాజకీయ భవితవ్యం అయోమయంలో పడింది. కోర్టు తీర్పు వ్యక్తిగతంగా కలానీకే కాకుండా ఎన్సీపీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసు నేపథ్యం ఇదీ... బోగస్ ఓటింగ్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన ఘనశ్యాం భతీజాను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 1990లో హత్య చేశారు. అయితే ఈ హత్యను పప్పు కలానీ చేయించాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసులో ప్రధాన సాక్షి, ఘనశ్యాం సోదరుడు ఇందర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే సోదరుడి హత్య జరిగిన మరుసటి రోజే(ఏప్రిల్ 28, 1990) ఇందర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇందర్ అక్కడికక్కడే మరణించాడు. ఘనశ్యాం హత్య నేపథ్యంలోనే ఇందర్ హత్య కూడా జరిగిందని భావించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కిందిస్థాయి కోర్టులన్నింటినీ దాటుకుంటూ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పప్పుపై సుప్రీంకోర్టు టాడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి టాడా కేసు నుంచి పప్పు విముక్తి పొందినా ఇందర్ హత్యపై విచారణ జరపాలని సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరిపిన సెషన్స్ కోర్టు పప్పు కలానీతోపాటు అతని నలుగురు అనుచరులను దోషులుగా నిర్ధారిస్తూ జీవితఖైదు శిక్షను విధిస్తూ ఏప్రిల్ 3, 2013లో తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పప్పు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా కిందిస్థాయి కోర్టు విధించిన తీర్పును ఖరారు చేస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. బరిలో ఉండారా? లేదా? నాలుగేళ్లకు మించి జైలుశిక్ష పడినవారంతా ఎన్నికల బరిలో నిలిచేందుకు అనర్హులుగా మారుతున్న నేపథ్యంలో జీవితఖైదు శిక్ష పడిన పప్పు ప్రస్తుత ఎన్నికల బరిలో ఉండారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై ఎన్నికల సంఘం ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
భార్యను కడతేర్చిన భర్తకు యావజ్జీవ శిక్ష
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను మానసికంగా, శారీరకంగా వేధించి చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి యార రేణుక బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని పసరుగొండ గ్రామానికి చెం దిన మంద లక్ష్మీనారాయణ రెండో కూతురు చామంతి(26)ని 2006 సంవత్సరంలో హసన్‌పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన తోట కోటికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా చామంతి తల్లిదండ్రులు కట్నకానుకల కింద కోటికి రెండెకరాల భూమి, రూ. లక్ష నగదుతోపాటు ఇతర వస్తువులు ఇచ్చా రు. అయితే పెళ్లి అయిన తర్వాత వీరికి సం తానం కలుగలేదు. దీంతో తనకు కట్నంగా ఇచ్చిన రెండెకరాల భూమిని అమ్మి డబ్బులు తీసుకరావాలని కోటి తన భార్య చామంతిని వేధించేవాడు. ఈ క్రమంలో 2011 సెప్టెంబర్ లో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు రూ. 4 లక్షలను పెద్దల సమక్షంలో లక్ష్మీనారాయణ తన అల్లుడు కోటికి ఇచ్చాడు. అయితే గతం లో చేసిన అప్పులను భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో కొంత తీర్చి, మిగతా దాంతో జల్సాలు చేశాడు. అనంతరం తనకు మరో రూ. 2 లక్షలు కావాలని చామంతిని భ ర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ ఆమె భర్త వేధించేవారు. దీంతో చామంతి తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పుకోవడంతో తండ్రి లక్ష్మీనారాయణ మళ్లీ రూ. 50 వేల నగ దు అల్లుడికి ఇచ్చాడు. అయితే తమ కొడుకు రూ.2 లక్షలు అడిగితే నువ్వు రూ. 50వేలే ఇచ్చావని.. నీబిడ్డ ఎలా బతికి బట్టకడుతుందో.. చూస్తామని.. అదేరోజు చామంతి ఆడబిడ్డ, ఆమె భర్త.. లక్ష్మీనారాయణను బెదిరించారు. ఈ క్రమంలో 2012 మార్చి 21న అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త కోటితోపాటు అత్తమామలు శశిరేఖ, రెడ్డయ్య లు కలిసి చామంతి పడుకున్న ఇంట్లోకి వెళ్లి సుత్తెతో ఆమె తల, మెడపైన విపరీతంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అయితే తాము చేసిన హత్య బయటకు రాకుండా ఉండేందుకు వారు ఇంటి వెనకాల ఉన్న చేదబావిలో చామంతి మృతదేహాన్ని పడవేశారు. అనంతరం చామంతి ఆడబిడ్డ భర్త భూతం సుధాకర్ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ ద్వారా చామంతి తల్లిదండ్రులకు మీ బిడ్డ చనిపోయిందని సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటినా అక్కడికి వెళ్లారు. అయితే తమ అల్లు డు, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త కలిసి తమ కూతురిని హత్య చేశారని మృతురాలి తండ్రి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు కోటిపై వరకట్న వేధిం పులు, హత్యానేరం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏడుగురు సాక్ష్యాలను విచారించిన అనంతరం నేరం రుజువుకావడంతో తోట కోటికి యావజ్జీవ జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధిస్తూ జడ్జి రేణుక తీర్పు చెప్పారు. కాగా, కేసు పరిశోధనను సీఐ డి.చంద్రయ్య చేయగా, ఇన్స్పెక్టర్ రమేష్‌బా బు, హెడ్ కానిస్టేబుల్ నారాయణదాసు నిం దితులను కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే ప్రాసిక్యూషన్ పక్షాన విచారణను పర్యవేక్షిం చగా, అదనపు పీపీ విజయాదేవి వాదించా రు. కాగా, సాక్షులను కానిస్టేబుళ్లు టి.కృష్ణ, బి.ఈశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు. -
సీపీఎం నేతలకు యావజ్జీవం
కోజికోడ్: సంచలనం సృష్టించిన టి.పి.చంద్రశేఖరన్ హత్య కేసులో కేరళ సీపీఎంకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సహా 11 మందికి ప్రత్యేక కోర్టు మంగళవారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష వేసింది. కోజికోడ్ జిల్లా ఓంచియామ్ గ్రామంలో సీపీఎం పెత్తనాన్ని నిరసిస్తూ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ నెలకొల్పిన చంద్రశేఖరన్(51).. 2012 మే 4న దారుణ హత్యకు గురయ్యారు. ఏడుగురు ఆయన ను 51 సార్లు కత్తిపోట్లు పొడిచినట్లు దర్యాప్తులో తేలింది. సీపీఎంకు చాలా కాలం సేవలందించిన నేతను సొంత పార్టీ నేతలే చంపించడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పినరయి విజయన్, అచ్యుతానందన్ వర్గాల మధ్య వివాదమే రేపింది. ‘ రాజకీయ శత్రుత్వంతో చంద్రశేఖరన్‌పై హత్యకు పురికొల్పిన వారి చేతిలో నిందితులు పనిముట్లయ్యారు’ అని జడ్జి పేర్కొన్నారు. శిక్ష పడిన సీపీఎం నేతల్లో కున్హనందన్(పానూర్ కమిటీ), కె.సి.రామచంద్రన్(స్థానిక కమిటీ నేత), మనోజ్(శాఖ కార్యదర్శి) ఉన్నారు.