సైకో వీరంగం :15 మందిపై దాడి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ రింగు రోడ్డులో మంగళవారం సైకో వీరంగం సృష్టించాడు. స్థానికంగా చిరువ్యాపారం చేసుకుంటున్నవారిపై, మహిళలు, విద్యార్థినిలపై దాడి చేసి బండబూతులు తిట్టాడు. దీంతో నానా హంగామా చేస్తున్న సైకోను స్థానికులు కర్రలతో చితకబాది పోలీసులకు అప్పగించారు. స్టేషన్కు వెళ్లిన తర్వాత మహిళా పోలీసుల పట్ల కూడా అసభ్యపదజాలంతో దూషించడంతో పోలీసులు సైకోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొత్తం 15 మందిపై సైకో దాడి చేసినట్లు స్తానికులు తెలిపారు.