గణతంత్ర పరేడ్‌కు జిల్లా విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే పరేడ్‌లో పాల్గొనేందుకు జిల్లాలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులకు గురువారం స్థానిక మెడికల్ కళాశాల పక్కనున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.
ఎంపికైన వారిలో వై. రామకృష్ణ(మున్సిపల్ హైస్కూల్-బాపట్ల), డి. వ్యాసు (జెడ్పీ హైస్కూల్-గణపవరం), పి. జయరాజ్(జెడ్పీ హైస్కూల్-అబ్బినేని గుంటపాలెం), డీవీ సాయిమనోజ్( అశోక్ హైస్కూల్-పెదనందిపాడు), కె. వంశీకృష్ణ, సీహెచ్ కృష్ణవేణి, కె.స్వాతి, టి. అనిత(సన్ జాన్స్ హైస్కూల్-కారంపూడి) ఉన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి. రమేష్, స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కార్వ నిర్వాహక కమిషనర్ పి. శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి డీఎల్ నారాయణ, జిల్లా కోశాధికారి రత్నాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.