భీమవరంలో ‘బాపు గారి బొమ్మ’
భీమవరం కల్చరల్, న్యూస్‌లైన్ : అత్తారింటికి దారేది ఫేం ప్రణీత బుధవారం భీమవరంలో సందడి చేశారు. జువ్వలపాలెం రోడ్డులోని ఆనంద కన్వెన్షన్‌లో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆమె ఎగ్జిబిషన్ అంతా కలియ తిరిగి శారీస్, డ్రస్ మెటీరియల్స్‌ను పరిశీలించారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన మహిళలు ప్రణీతతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఆమెతో ఫొటోలు దిగారు. కన్వెన్షన్ బయట ఉన్న యువకులు తమ అభిమాన నటిని చూసేందుకు ఎగబడ్డారు. ఎగ్జిబిషన్ మేనేజర్లు లీలాకుమార్, రాజు కృష్ణ మాట్లాడుతూ వచ్చే నెల 10 వరకు ఎగ్జిబిషన్, సేల్స్ ఉంటాయని చెప్పారు.
మహిళలకు కావాల్సిన అన్నిరకాల చీరలు, చిన్న పిల్లల దుస్తులు అందుబాటులో ఉంటాయని, చీరలపై 60 శాతం వరకు రిబేట్ ఇస్తున్నామన్నారు. అనంతరం ప్రణీత విలేకరులతో మాట్లాడుతూ భీమవరం రావడం ఇదే మొదటిసారని, ఈ ప్రాంతమంతా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉందన్నారు. ఇక్కడకు వచ్చి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, ప్రస్తుతం రభస సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలన్నదే తన అభీష్టమని, తనను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఇలాగే ఆదరించాలని కోరుకున్నారు.