ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ భారత్’
అనంతపురం టవర్‌క్లాక్ :కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజా సహకారంతో నిరంతరం కొనసాగిస్తామని రైల్వే శాఖ డివిజినల్ ఆపరేటింగ్ సీనియర్ మేనేజర్ ఆల్విన్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చీపురు పట్టి చెత్తను తొలగించారు. ముందుగా రైల్వేస్టేషన్ ఆవరణంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు క్రిష్ణయ్య, స్టేషన్ మేనేజర్ అశ్వర్థనాయక్, పారిశుద్ధ్య సి బ్బంది, రైల్వే పోలీసులు , ఉద్యోగులు, కార్మికులతో ఆయన ప్రతిజ్ఙ చేయించారు.
స్టేషన్ ఆవరణంలో చెత్తను తొలగించి, మొక్కలను నాటారు. రైల్వే స్టేషన్లో, క్వాటర్స్‌లో ఇళ్ల వద్ద ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. రైల్వే అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. ఆల్విన్ మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు. ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన, స్టేషన్ మాస్టర్ జయచంద్రనాయుడు, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ దామోదరమూర్తి, సిగ్నల్ ఇంజనీరు సత్యం, రవిబాబు, సీటీఐ ప్రసాద్, ఇంజనీర్లు గోవిందరాజులు, ఎఎస్ఐ లింగమయ్య, కార్పొరేటర్ మళ్లికార్జున, కార్మికులు, ఉద్యోగులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ పోలీస్టేషన్లో సీఐ మధుసూదన ఆధ్వర్యంలో ఆయుధ పూజను చేశారు