రాజధానికి చేరిన టీఆర్ఎస్ లడాయి
ముఖ్యప్రజాప్రతినిధి తనయుడి తీరుపై అధిస్టానం సీరియస్
విచారణలో పోలీసుల జాప్యం
జ్యోతినగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీకిచెంది న ముఖ్య నాయకులు తనయుల మధ్య రెం డు రోజుల క్రితం జరిగిన ఘర్షణ విషయం రాష్ట్ర రాజధానికి చేరింది. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌రహదారికి ఆనుకుని ఉన్న తాజ్ రెస్టారెంట్ ఎదుట శనివారం రాత్రి జరిగిన సంఘటన చివరకు రాష్ట్రస్థాయి నాయకుల వరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో రామగుండం ప్రజాప్రతినిధి తనయుడిపై అధిస్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కోహెడ మండలానికి చెందిన నాయకుని తనయుడి పక్షాన సీనియ ర్ నాయకులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఓ బడా కాంట్రాక్టర్‌పై సైతం అతడి అనుచరులు దాడి చేసినట్లు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు అందింది. తా జాగా తాజ్ రెస్టారెంట్ ఎదుట జరిగిన ఘర్షణపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశాయి. అయినా పోలీసులు మౌనంగా ఉండడం గమనార్హం. ఇరువర్గాలు అధికారపార్టీ వారు కావడంతో పోలీసులు మిన్నకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.