భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
అనంతపురం జిల్లా బి.హీరేహల్ మండలం పూలకుర్తిలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబ కలహాలే నేపథ్యం కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.