punched in the face
-
బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్ ఖన్నా వాన్వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. -
ఐరిస్‌తోనే రేషన్!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పౌర సరఫరాల శాఖ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఐరిస్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ అందించే ప్రక్రియను మే నెల నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐరిస్ మిషన్లు జిల్లాకు వచ్చేశాయి. వీటిని వారం రోజుల్లో రేషన్ డీలర్లకు పంపిణీ చేయనున్నారు. మే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని 751 రేషన్ దుకాణాల్లో ఇకపై ఈ నూతన విధానం ద్వారా సరుకులు పంపిణీ కానున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా, జవాబుదారీతనంగా చేయడానికి ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం అమలవుతున్న విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అరికట్టేందుకు 2017లో ఈ–పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి మిగులు బియ్యం పెరి గి ఖర్చు తగ్గినట్లయింది. అయితే, కొంత మంది లబ్ధిదారుల వేలి ముద్రలు వివిధ కారణాలతో బయోమెట్రిక్ మెషిన్లో రాకపోవడంతో వారికి రేషన్ అందించడం కష్టమవుతోంది. స్థానిక వీఆర్వో సర్టిఫికేషన్ చేస్తేనే రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. జిల్లాలో మొత్తం 751 రేషన్ దుకాణాల పరిధిలో 3,89,827 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులందరికీ కలిపి ప్రతి నెలా దాదాపు 8,185 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు కిరోసిన్, గోధుమలను ఈ–పాస్ విధానంతో అందజేస్తున్నారు. వేలి ముద్రలు రాక ప్రతి నెలా దాదాపు 5,500 మందికి పైగా లబ్దిదారులు వీఆర్వో సర్టిఫికేషన్‌తో సరుకులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించి సరుకులకు కాజేసి ఎక్కువ ధరకు బాక్ల్ మార్కెట్ తరలిస్తున్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. అలాగే లబ్ధిదారులు చనిపోయినా, రేషన్ తీసుకోకపోయినా డీలర్ వారి సరుకులను పొందినట్లుగా రికార్డుల్లో చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఐరిస్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో నూరు శాతం అక్రమాలకు చెక్ పడనుంది. ఐరిస్ మిషన్లను, బయోమెట్రిక్ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. లబ్ధిదారులకు ముందుగా వారి వేలి ముద్రల ఆధారంగా రేషన్ ఇస్తారు. వేలి ముద్రలు రాని పక్షంలో ఐరిస్ ద్వారా సరుకులు అందజేస్తారు. ఇక నుంచి ఐరిస్‌తోనే.. ప్రజా పంపిణీలో ఐరిస్ విధానం మే నెల నుంచి అమలు కానుంది. ఇందుకు సంబంధించిన ఐరిస్ మెషిన్లు జిల్లాకు వచ్చాయి. వీటిని త్వరలో డీలర్లకు అందజేసి వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తాం. వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఈ విధానం ద్వారా, ఇకపై వీఆర్వో సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా సరుకులు పొందవచ్చు. ప్రజా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. – కృష్ణప్రసాద్, డీఎస్వో -
ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు
-
ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు
మాడ్రిడ్: ఓ యువకుడు ఏకంగా ప్రధానమంత్రిపై దాడిచేసి ఆయన ముఖంపై పంచ్ విసిరాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కళ్లద్దాలను విరగొట్టేశాడు. ఈ ఘటన స్పెయిన్ లోని పాంటేవేద్రాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్ పెంటేవేద్రా అనే పట్టణంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆండ్రీస్ డెల్ వీ అనే ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అన్నట్లుగా ప్రధాని దగ్గరికి వచ్చాడు. కుడి చేతిలో ముబైల్ పట్టుకుని సెల్ఫీ కోసం ప్రధానికి దగ్గరికి వచ్చాక, ఆ యువకుడు తన ఎడమ చేతితో ప్రధాని రాజోయ్ ముఖంపై ఓ పంచ్ విసిరాడు. ప్రధానిపై దాడికి పాల్పడటంతో పాటు ఆయన కళ్లద్దాలను విరగొట్టాడు. ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రధానిని ఓ అధికారి కారులో అక్కడి నుంచి లా కరునా నగరానికి తీసుకెళ్లారు. ఈ అనూహ్య సంఘటనకు పార్టీ మంత్రులు, నేతలు షాక్ తిన్నారు. ఆ యువకుడు ప్రధానిని కొట్టడంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు, మాటలు రావట్లేదని పబ్లిక్ వర్క్స్ మంత్రి అనా పాస్టర్ అన్నారు. స్పానిష్ సోషలిస్ట్ పార్టీ నేతలందరి తరఫున ప్రధాని రాజోయ్కు ఆ పార్టీ నేత పెడ్రో సాంచెజ్ తన సంఘీభావాన్ని తెలిపారు. అరెస్టు చేసిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. ప్రధానిని కొట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ యువకుడు సమాధానమివ్వడంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.