purandhreswari
-
ఏపీ రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కంటే ప్రతిభావంతులైన వారు బీజేపీలో ఉన్నప్పటికి తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు శక్తి వంచన మేరకు దక్షిణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: జేపీ నడ్డా టీం: రామ్ మాధవ్‌కు దక్కని చోటు!) పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందో ఆ మేరకు దక్షిణ ప్రాంతంలో అమలు పరుస్తామని పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నకాలంలో బీజేపీ అధికారంలోకి తేవడం అంత ఆషామాషీ కాదని కాని ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. తద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. వ్యవసాయ బిల్లులో ఒకటి రెండు అంశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ రైతులకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని పురేందశ్వరి అన్నారు. -
జేపీ నడ్డా టీం: రామ్ మాధవ్‌కు దక్కని చోటు!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఎనిమిది మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టిన అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ నేత పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్‌ను నియమించింది. ఇక రామ్ మాధవ్, మురళీధర్‌రావు, జీవీఎల్ నరసింహారావుకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. కాగా ఈ ఏడాది జనవరిలో జేపీ నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం గమనార్హం. అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తున్నా బీజేపీ నూతన కార్యవర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పార్టీ సంప్రదాయాన్ని నిలబెడుతూ దేశం కోసం నిస్వార్థంగా, అంకిత భావంతో పని చేయాలని ఆకాంక్షించారు. పేద ప్రజలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. ధన్యవాదాలు: రామ్ మాధవ్ బీజేపీ నూతన కార్యవర్గానికి ఆ పార్టీ నేత రామ్ మాధవ్ అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించే అవకాశం తనకు కల్పించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ మోర్చా అధ్యక్షులు యువ మోర్చా అధ్యక్షుడు- ఎంపీ తేజస్వి సూర్య జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు- డాక్టర్ లక్ష్మణ్ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు- ఎంపీ రాజ్ కుమార్ చాహర్ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- లాల్ సింగ్ ఆర్య ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- సమీర్ ఒరాన్ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- జమాల్ సిద్ధికి -
పాపం పురందేశ్వరి
నిన్నటి వరకు కేంద్ర మంత్రిగా అధికారం చలాయించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు. కమలదళంలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే అక్కడ తెలుగు దేశం కార్యకర్తలు ఆమెకు మద్దతు ప్రకటించడం లేదు. పురందేశ్వరి వల్ల లాభం కంటే తమకు నష్టమే ఎక్కువ జరుగుతోందని టీడీపీ ఆందోళన చెందుతోంది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓటర్లు ఆమెను వ్యతిరేకిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లూ ఆమెకు దూరందూరంగా ఉంటున్నారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో వైఎస్ఆర్ జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కోడూరు, రాజంపేట, రాయచోటి కడప జిల్లాలో ఉండగా.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వీటిలో మొదటి నుంచీ మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయచోటి, మదనపల్లి వంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరింట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుండగా.. మదనపల్లెను మాత్రం బీజేపీకి కేటాయించారు. అయితే మైనారిటీ ఓటర్లు ఆమెకు మద్దతు పలికే విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారు. పురందేశ్వరి నియోజకవర్గంలో జోరుగానే పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ కూతురునని గుర్తు చేస్తున్నారు. ఆయన ఆశయాల మేరకు పని చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె ఎంత ఎన్టీఆర్ కూతురైనా.. పార్టీ మారి బీజేపీలో చేరడం, సమైక్యాంధ్ర విషయంలో చివరి వరకూ ఏమీ చేయలేకపోవడం వంటి అంశాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఇది తమ అభ్యర్థులకు కూడా ఇబ్బందికరంగా మారిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాలుగేళ్లుగా జనంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఎదుర్కోవడం కత్తిమీద సామేనని టిడిపి నాయకులు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
'ఆ' సీటుపై ఆశపడ్డ మాట వాస్తవమే కానీ..
-
అసలు సమస్య పురంధ్రేశ్వరేనా?
* బిజెపిపై బాబుకు కోపమెందుకు? * బిజెపికి బలం లేని సీట్లిచ్చిందెవరు? * ఎన్టీఆర్ వారసత్వం ఇంకొకరికి దక్కకుండా ప్రయత్నమా? చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి బిజెపిపై విరుచుకుపడటానికి కారణం ఏమిటి? బిజెపి బలహీనమైన అభ్యర్థులను పెట్టిందని, దీని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కే లాభమని ఆయన విమర్శించి, అసలు బిజెపితో పొత్తు ఉండబోదని అనడానికి కారణమేమిటి? చంద్రబాబుకే పొత్తు అవసరం: నిజంగానే చంద్రబాబుకు పొత్తు అవసరం లేదని అనిపిస్తోనుకుంటే పొరబాటే. ఆయనే పొత్తు కోసం వెంపర్లాడారు. బిజెపి సదస్సులకు పిలవకుండానే వెళ్లి మరీ నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. మోడీని తెగపొగిడారు. తెలంగాణ బిజెపి వద్దు వద్దంటున్నా యాసిడ్ ప్రేమికుడిలా వెంటపడ్డారు. తెలంగాణలో, సీమాంధ్రలో బిజెపి డిమాండ్లన్నిటినీ ఒప్పుకున్నారు. ఇదంతా బిజెపి అవసరం కాబట్టే చేశారు. సీమాంధ్రలో బీజేపీ కొండకు వెంట్రుక కట్టింది. వస్తే కొండ వస్తుంది. పోతే వెంట్రుక పోతుంది. కానీ టీడీపీకి మాత్రం ఈ సారి గెలవడం చాలా అవసరం. నిజంగా బలహీనమైన క్యాండిడేట్లే సమస్యా?: చంద్రబాబు బిజెపికి ఇచ్చిన సీట్లు టీడీపీ గెలవడం కష్టం. అంతే కాదు. బిజెపికి చాలా చోట్ల కనీస బలం కూడా లేదు. ఉదాహరణకు రాజోలు, రాజమండ్రిలలో బిజెపి గెలవడం చాలా కష్టమన్నది రాజకీయాలు తెలిసిన వారి అభిప్రాయం. బిజెపి సీట్లలో ఇలాంటివి చాలా ఉన్నాయి. 'గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్లు ఈ సీట్లు ఇచ్చినప్పుడు చంద్రబాబుకు తెలియదా? ఇప్పుడు హఠాత్తుగా బిజెపి బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతోందని విమర్శించడంలో అంతరార్థం ఏమిటన్నదే ప్రశ్న! ఎన్టీఆర్ తనయతోనే సమస్యంతా: నిజానికి అసలు సమస్య ఇవేవీ కాదు. ఎన్టీఆర్ తనయ పురంధ్రేశ్వరికి రాజంపేట టికెట్ ఇవ్వడమే అసలు సమస్య. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ప్రజలకు మరో ప్రత్యామ్నాయం రాకుండా ఉండటం, ఎన్టీఆర్ వారసత్వానికి పోటీదారు ఇంకొకరు రావడం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదు. పురంధ్రేశ్వరి ఉంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాను చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడం చంద్రబాబుకు చాలా కష్టం అవుతుంది. తెగేదాకా లాగుతారా చంద్రబాబు?: గతంలోనూ చంద్రబాబు పురంధ్రీశ్వరి, దగ్గుబాటిలను ఇదే విధంగా దెబ్బతీశారు. 2004 నాటికి వీరిద్దరూ బిజెపిలో ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా యాక్టివ్ గా పనిచేశారు కూడా. కానీ 2004 ఎన్నికల పొత్తు పేరిట వీరిద్దరినీ బిజెపి పక్కనపెట్టేలా చేశారు చంద్రబాబు. ఫలితంగా వారు కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత దగ్గుబాటి ఎమ్మెల్యే అయ్యారు. పురంధ్రేశ్వరి ఎంపీ గా ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబుకి పురంధ్రీశ్వరికి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు కోపం తెచ్చుకున్నారు. కానీ బేరం పూర్తిగా తెగేదాకా చంద్రబాబు లాగగలరా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. -
కేంద్ర మంత్రి కారుకు అడ్డంగా సమిక్య వాదులు