Purav Raja
-
సెమీస్‌లో పేస్ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్–పురవ్ రాజా (భారత్) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పేస్–పురవ్ రాజా ద్వయం 6–4, 3–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబోలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జోడీ తొలి సెట్‌ను నెగ్గినా... రెండో సెట్లో తడబడింది. సూపర్ టైబ్రేక్‌లోనూ ఈ భారత జోడీ ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన పేస్ జంటకు 15,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చెన్నై ఓపెన్ ఫైనల్లో దివిజ్–పురవ్ జోడీ
చెన్నై: స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్ గెలిచేందుకు దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) జంట మరింత చేరువైంది. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 6–4, 6–2తో గిలెర్మె దురాన్–ఆండ్రీస్ మోల్తెని (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. గతంలో దివిజ్–పురవ్ బొగోటా ఓపెన్ (2013లో), లాస్ కబోస్ ఓపెన్ (2016లో) టోర్నీలలో విజేతగా నిలిచారు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో రోహన్ బోపన్న–జీవన్ (భారత్) జంట నికొలస్ మోన్రో (అమెరికా)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీతో ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో దివిజ్ జోడి
తాష్కెంట్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్-పురవ్ జంట 5-7, 6-3, 10-3తో ఆండ్రియా అర్నాబోల్డి-ఫాబియాన్ (ఇటలీ) ద్వయంపై విజయం సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మాలిక్ జజారీ (టర్కీ)-దస్తోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడితో దివిజ్-పురవ్ తలపడతారు.