సెమీస్‌లో పేస్‌ జోడీ ఓటమి | Leander Paes, Purav Raja reach St. Petersburg Open tennis semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో పేస్‌ జోడీ ఓటమి

Published Sat, Sep 23 2017 1:07 AM | Last Updated on Sat, Sep 23 2017 2:11 AM

Leander Paes, Purav Raja reach St. Petersburg Open tennis semi-finals

న్యూఢిల్లీ: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఓపెన్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో లియాండర్‌ పేస్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పేస్‌–పురవ్‌ రాజా ద్వయం 6–4, 3–6, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబోలాస్‌ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్‌ జోడీ తొలి సెట్‌ను నెగ్గినా... రెండో సెట్‌లో తడబడింది. సూపర్‌ టైబ్రేక్‌లోనూ ఈ భారత జోడీ ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన పేస్‌ జంటకు 15,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement