పంట ఎండిపోయిందని..యువరైతు ఆత్మహత్య
ముస్తాబాద్(కరీంనగర్ జిల్లా): మండలంలోని మద్దికుంటలో పంట ఎండిపోయిందనే మనస్తాపంతో పరుష స్వామి(26) అనే యువ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రూ.6 లక్షల అప్పు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. నాలుగు ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.