pushpotsavam
-
పుష్పోత్సవం..మల్లన్న వైభవం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం పుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల యాగాలకు ఆదివారం పూర్ణాహుతి జరిగిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణచేసి ఉత్సవాలకు ముగింపు పలికారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో మహాశివ రాత్రిన వధూవరులైన స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాత్రి 8.30 గంటలకు అశ్వవాహనంపై అధిష్టింపజేసి విశేష వాహనపూజలను అర్చకులు, వేదపండితలు నిర్వహించారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయంలోనే ఊరేగించారు. స్వామివార్ల పుష్పోత్సవ, శయనోత్సవ వేడుకల కోసం పరిమళభరితమైన పుష్పాలతో అలంకార మండపాన్ని తీర్చిదిద్దారు. రాత్రి 9.30గంటల తరువాత ఆదిదంపతులకు వేదమంత్రోచ్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పుష్పోత్సవ సేవా కార్యక్రమం జరిగింది. 11 రకాల పుష్ప ఫలాదులతో స్వామివార్లకు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివార్ల కోసం ఎర్రబంతి, పసుపుబంతి, పసుపు, తెల్లచేమంతి, మల్లెలు, కనకాంబరాలు, ఎర్ర, తెల్ల, ముద్ద, దేవ, సువర్ణ గన్నేరు, నంది, గరుడవర్థనం, మందారం, ఎర్ర , నీలం ఆస్టర్, కాగడాలు, జబ్రా, కారినేషన్, ఆర్కిడ్స్, గ్లాడియేలస్ తదితర పుష్పాలను ఉపయోగించారు. స్వామివార్ల ఏకాంత సేవ కోసం అద్దాల మండపంలోని ఊయల తల్పాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఏకాంతసేవను ఆగమ సంప్రదాయానుసారం వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. అలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
దేదీప్యమానం..!
–అంబరాన్నంటిన పుష్కర ముగింపు వేడుకలు · శ్రీశైలంలో వైభవంగా పుష్పాభిషేకం · 30 మంది వేదపండితులతో శాస్త్రోక్తపూజలు ·12 టన్నుల పూలతో పుష్పోత్సవం శ్రీౖశైలం: కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలు మంగళవారం శ్రీశైల మహాక్షేత్రంలో అంబరాన్నంటాయి. వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పాతాళగంగ వద్దకు మేళ తాళాలతో చేరుకున్నారు. ఓం నమఃశివాయ పంచాక్షరి నామజపం చేస్తూ కృష్ణవేణీ మాతను అనుగ్రహించాల్సిందిగా కోరారు. పుష్కర స్నానం చేసి కలశంలో పాతాళగంగలోని పుష్కర జలాన్ని నింపుకుని మల్లన్న ఆలయప్రాంగణం చేరుకున్నారు. మల్లన్న గర్భాలయ దక్షిణ ద్వారం నుంచి స్వామివార్ల వద్దకు చేరుకుని మూలవిరాట్ను అభిషేకించారు. ముపై ్ప మంది వేదపండితుల వేదమత్రోచ్చారణల మధ్య 12 టన్నుల పూలను మల్లన్న పుష్పాభిషేక మహోత్సవానికి వినియోగించారు. మల్లన్న పుష్పోత్సవ.... వైభోగం! అభిషేక ప్రియుడు, మల్లెపూలంటే విపరీతమైన ఆపేక్ష ఉన్న శ్రీమల్లికార్జునస్వామి రంగురంగుల గులాబీలు, అనేక రకాలైన చేమంతులు, వివిధరకాలైన టన్నుల కొద్ది పూలను రాశులుగా పోసి స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపం పక్కనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఓ వైపు వేదపండితులు మంత్రోచ్చారణలతో ఆలయప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుండగా, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామశివాచార్యా స్వామీజీ, దత్తగిరి పీఠాధిపతులు గణపతిపూజతో పుష్పాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ, ఆర్డీఓ రఘుబాబు..తదితరులు స్వామివార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు వేదికపై ఉన్న శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు పుష్పాలను సమర్పించారు. బాణ సంచా వెలుగులు పుష్పాభిషేక మహోత్సవం ముగుస్తున్న సమయంలో బాణ సంచా వెలుగులు ఒక్కసారిగా విరజిమ్మాయి. దాదాపు గంటపాటు ఆకాశంలో బాణ సంచా వెలుగులు కనువిందు చేశాయి. కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలలో మల్లన్న వైభోగాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక తరంగాలలో తేలియాడారు. ముగింపు వేడుకలను పూసగుచ్చినట్లుగా డాక్టర్ దీవి హయగ్రీవాచార్య చేసిన ప్రత్యక్ష వాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు.