Q3 GDP
-
క్యూ3లో యూఎస్ జీడీపీ 33 శాతం అప్
వాషింగ్టన్: కోవిడ్-19 వేధిస్తున్నప్పటికీ యూఎస్ ఆర్థిక వ్యవస్థ క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఏకంగా 33.1 శాతం పురోగమించింది. వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 33.1 శాతం వృద్ధిని సాధించింది. వెరసి తొలుత వేసిన వృద్ధి అంచనాలను ఆర్థిక వ్యవస్థ ఎలాంటి మార్పులు లేకుండా సాధించినట్లయ్యింది. కాగా.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికమని ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా తెలియజేశారు. 1947 నుంచి గణాంకాలు నమోదు చేయడం ప్రారంభించాక 1950లో మాత్రమే దేశ జీడీపీ ఒక త్రైమాసికంలో అత్యధికంగా 16.7 శాతం పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు, హౌసింగ్, ఎగుమతులు భారీగా పుంజుకున్నప్పటికీ.. స్థానిక ప్రభుత్వాల వినిమయంతోపాటు, వినియోగ వ్యయాలు తగ్గడం, నిల్వలు పెరగడం వంటివి బలహీనపడినట్లు గణాంకాలు వివరించాయి. మాంద్య పరిస్థితులు ఈ ఏడాది క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మైనస్‌లోకి జారుకునే వీలున్నట్లు యూఎస్ విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో భాగంగా తిరిగి కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు వ్యవస్థలకు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా క్యూ4లో ప్రతికూల వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది విశ్లేషకులైతే మహామాంద్యం ముప్పు పొంచిఉన్నట్లు అంచనా వేస్తుండటం గమనార్హం. కాగా.. వార్షిక ప్రాతిపదికన యూఎస్ జీడీపీ తొలి క్వార్టర్లో 5 శాతం క్షీణించగా.. క్యూ2లో మరింత అధికంగా 31.4 శాతం క్షీణించిన విషయం విదితమే. క్యూ2లో లాక్డవున్లు, ఉద్యోగాల కోత తదితర అంశాలు ప్రభావం చూపాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టపోయిన ఉత్పాదకతను తిరిగి సాధించడం అంత సులభంకాదని, కోవిడ్-19 మరోసారి కల్లోలం సృష్టిస్తుండటంతో వచ్చే ఏడాది(2021) తొలి త్రైమాసికం(జనవరి- మార్చి)లోనూ దేశ జీడీపీ మైనస్‌లోకి జారుకునే అవకాశమున్నదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. -
ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి...
క్యూ3 జీడీపీ గణాంకాలపై ఫిచ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడవ త్రైమాసిక గణాంకాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉన్నాయని ఫిచ్ తాజా నివేదిక ఒకటి విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే రూ.500, రూ.1,000 రద్దు ప్రతికూలతను ఎదుర్కొన్న ఈ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదుకావడం పలువురు ఆర్థిక విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని మిగిల్చింది. ఇప్పుడు తాజాగా ఫిచ్ సైతం ఇదే వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. డీమోనిటైజేషన్ సమయంలో వాస్తవంగా సేవలు అలాగే వినియోగ డిమాండ్ తీవ్ర విఘాతానికి గురయిన సంగతినీ ఫిచ్ ప్రస్తావించింది. దీనికి విరుద్ధంగా ప్రైవేటు డిమాండ్ భారీగా 10 శాతం పెరిగిందని అధికారిక క్యూ3 గణాంకాలు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తున్నట్లు వివరించింది. తన తాజా గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ) నివేదికలో ఈ అంశాలను ఫిచ్ ప్రస్తావించింది. వచ్చే మూడేళ్లలో వృద్ధి 7 శాతం పైనే... క్యూ3 జీడీపీ గణాంకాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) వృద్ధి 7.1 శాతం ఆ తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిచ్ అంచనా వేసింది. వ్యవస్థాగత సంస్కరణలను క్రమంగా అమలులోకి తీసుకురావడం భవిష్యత్తులో వృద్ధికి దహదపడే అంశమని ఫిచ్ విశ్లేషణ వివరించింది. దీనికితోడు దాదాపు 24 శాతం మేర పెరిగిన ఉద్యోగుల వేతనాలు, భారీ వ్యయ అవకాశాలు మొత్తంగా దేశంలో వృద్ధి మెరుగుదలకు దోహపడే అంశాలని పేర్కొంది. నోట్ల రద్దు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు: బాష్ కాగా, భారత్ పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని జర్మన్ ఆటో కంపోనెంట్ తయారీ సంస్థ– బాష్ భారత్ హెడ్ సౌమిత్రా భట్టాచార్య పేర్కొన్నారు. పూర్తి మామూలు పరిస్థితికి మరో రెండు నెలలు పట్టే వీలుందనీ విశ్లేషించింది.