చైనా తొలి చక్రవర్తి సమాధికి పాదరస రక్షణ!
బీజింగ్: చైనాను పాలించిన మొట్టమొదటి చక్రవరి కిన్ షీ హువాంగ్. ఆయన సమాధికి పాదరసం(మెర్క్యూరీ)తో రక్షణ కలి్పంచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ద్రవ రూపంలో ఉండే లోహమే పాదరసం. ఇది విషపూరితమైంది. కిన్ క్రీస్తుపూర్వం 221 నుంచి 210 దాకా.. పదేళ్లపాటు డ్రాగన్ దేశాన్ని శాసించాడు. కిన్ సమాధిని కట్టుదిట్టంగా నిర్మించారు. షాన్షీ ప్రావిన్స్‌లో 1974లో రైతులు పొలం దున్నుతుండగా కిన్ షీ హువాంగ్ సమాధి బయటపడింది.
చక్రవర్తి సమాధిని తెరిచే చూస్తే వినాశనం తప్పదన్న ప్రచారం బాగా వ్యాప్తిలో ఉంది. దీంతో, తెరిచే సాహసం చేయలేకపోయారు. సమాధికి సమీపంలో మట్టితో తయారు చేసిన సైనికులు, ఆయుధాలు, గుర్రాల విగ్రహాలు భారీగా బయటపడ్డాయి. మరణానంతరం కూడా చక్రవర్తిని కాపాడడానికి ఈ ‘టెర్రకోట ఆరీ్మ’ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చక్రవరి సమాధి చుట్టూ మెర్క్యూరీ లోహం స్వేచ్ఛగా కదులుతున్నట్లు పరిశోధకులు ఇటీవలే తేల్చారు. సమాధిని ఎవరూ తాకకుండా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.