qualities
-
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
నాణ్యతకు తిలోదకాలు
తల్లాడ : రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం ఆభాసు పాలవుతుంది. మండలంలో ఈ పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లు నాసిరకమైన పనులతో జరుగుతున్నాయి. సొంతింటి కల నెరవేరుతుందన్న పేదలకు ఆ ఇళ్లు ఎన్ని రోజులుంటాయోననే భయం పట్టుకుంది. బేస్మట్టం సరిగా లేకుండా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నారు. మండలంలోని రామచంద్రాపురంలో 13, వెంగన్నపేట గ్రామంలో 20, పినపాకలో 40, గోపాలపేటలో 50 ఇళ్లు నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నీ ప్టాస్టింగ్ చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.5.65 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇళ్లు కల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకొని నిర్మిస్తున్నాడు. నాసిరకమైన ఇసుకతో.. నాసికరమైన ఇసుకతో ఇళ్లు నిర్మిస్తున్నారు. కుర్నవల్లి, పినపాక, గొల్లగూడెం సమీపంలోని వాగుల వద్ద దొరికే రాళ్ల ఇసుకను వాడుతున్నారు. గోదావరి నుంచి ఇసుకను తెచ్చి వాడాల్సి ఉండగా ఖరీదు ఎక్కువని, స్థానికంగా దొరికే రాళ్ల ఇసుకను తోలి కట్టుబడికి ఉపయోగిస్తున్నారు. క్యూరింగ్ కూడా సరిగా ఉండటం లేదు. ఫలితంగా గోడలు కొద్ది రోజులకే పగుళ్లిస్తున్నాయి. ఎమ్మెల్యే హెచ్చరించినా .. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పినపాక గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన సమయంలో స్థానికంగా దొరికే రాళ్లు, దుబ్బ ఇసుకనే వాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే సబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల పాటే గోదావరి ఇసుక తెప్పించి వాడి మళ్లీ స్థానికంగా దొరికే ఇసుకను వాడుతున్నారు. దర్వాజాలు, కిటికీలు కూడా నాసిరకమైనవి పెడుతున్నారు. ఒకేసారి కొనుగోలు చేసి ఇళ్లకు అమర్చుతున్నారు. దీంతో తయారీలో కూడా నాణ్యత ఉండటం లేదు. వాటినే బెడ్ రూమ్ ఇళ్లకు పెడుతున్నారు. -
ఇన్ఫీలో జాబ్ కావాలంటే ఈ రెండు ఉండాలి!
ముంబై : మార్కెట్లో పెట్టుబడిదారి విధానం ఎలా ఉండాలి అంటే, కరుణ, దయా, జాలి గుణాలతో నిండి ఉండాలంటారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ఇటీవల కంపెనీల్లో టాప్ స్థాయి వ్యక్తులకు చెల్లించే వేతనాలతో పోలిస్తే కింద స్థాయి ఉద్యోగులకు చెల్లించే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ మేనేజ్ మెంట్ ను కడిగిపారేశారు కూడా. కంపెనీలో కార్పొరేట్ గవర్నెర్స్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు. మానవ మర్యాదలకు ఆయన ఎంతో అంకితభావంతో ఉంటారు. అలాంటి వ్యక్తి కంపెనీలో పనిచేయాలని ప్రతి టెక్నాలజీ విద్యార్థి కోరుకుంటుంటారు. అయితే ఇన్ఫోసిస్ లో జాబ్ కావాలని కోరుకునే ఉద్యోగులు ఓ రెండు క్వాలిటీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని నారాయణమూర్తి చెప్పారు. '' ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కావాలనుకునే వారికి తెలివి, విలువలు ఉండాలి. అంతకు మించి వారికి మరేది అవసరం లేదు'' అని మూర్తి పేర్కొన్నారు. అదేవిధంగా కార్పొరేట్ సమాజంలో నిర్ణయాలు తీసుకునే లీడర్లు పాటించవల్సిన నియమాలను కూడా ఆయన తెలిపారు. ''ఒకటి కార్పొరేట్ లీడర్లు తీసుకునే నిర్ణయం సమాజంలో మా కంపెనీకి గౌరవాన్ని పెంచుతుందా? అని ఆలోచించుకోవాలి. రెండోది ఉద్యోగుల నుంచి నాకు మంచి గౌరవం దక్కుతుందా? అని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి'' అని సూచించారు. ఇలాంటి ప్రశ్నలు కార్పొరేట్ నిర్ణయాల్లో ప్రాథమికమైనవని, వీటితో సమాజం ఎంతో సంతోషంగా ఉంటుందని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని మూర్తి చెప్పారు. డార్డన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సత్కరించిన థామస్ జెఫర్సన్ ఫౌండేషన్ మెడల్ ఫంక్షన్ లో మూర్తి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయమైన విలువలను మూర్తి హైలెట్ చేశారు. -
ఈ లక్షణాలు మీకుంటే మీరు మేధావే..!
మేధావి అనే మాట వినగానే ముఖం అలా వెలిగిపోతుంది. ఓ మేధావి గురించి మాట్లాడినా, చెప్పినా, లేదా అతడిని చూసినా ఓ రకమైన సంతోషం కలుగుతుంది. ఇంతకీ మేధావి అంటే ఎవరు? అసలు అతడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మేధావి గురించే మాట్లాడుకునే వారిలో మేధావి లక్షణాలు లేవా.. మేధావి కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే అంశంపై బ్రిటన్‌కు చెందిన ఓ అధ్యయనం కొన్ని వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఐదు లక్షణాలు ఉంటే మాత్రం మేధావేనట. ఆ లక్షణాలేమిటో ఒకసారి పరిశీలిస్తే.. 1. ప్రతి విషయం గురించి అమితమైన ఆసక్తి ఒకే అంశానికి పరిమితం కాకుండా నిరంతరం భిన్న విషయాలను పఠించి వాటిని నేర్చుకోవడం మేధావి లక్షణం. జీనియస్లంతా ఇలాగే చేస్తారట. 2.మీలో మీరు మాట్లాడుకోవడం సాధారణంగా కొంతమంది వ్యక్తులు తమలో తాము మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడు ఆ మాటలు బయటకు కూడా వినిపిస్తాయి. వారిని చూసి కొంతమంది నవ్వుకుంటారు కూడా. అయితే, అలా మాట్లాడుకునేవారు అస్సలు సిగ్గుపడొద్దట. ఎందుకంటే మేధావులు అలాగే చేస్తారని అధ్యయనం చెబుతోంది. 3.పుస్తకాల పురుగు సాధారణంగా ఎవరైతే నిత్యం పుస్తకాల్లో మునిగి ఉంటారో వారంతా జీనియస్ అంట. వారు పిచ్చిపట్టిన వారిలా పుస్తకాలు చదువుతూ కనిపిస్తారట. 4.కష్టాలతో ఎంజాయ్ మేధావులు కష్టాలను సవాలుగా తీసుకుని, వాటిని సొంత తెలివితేటలతో పరిష్కరించుకొని ఆనందంగా గడిపేస్తారంట. 5.తప్పులు క్షమించి మర్చిపోగలిగే తీరు సాధారణంగా మేధావులు తప్పు చేసిన వారిని క్షమిస్తారట. అసలు ఆ విషయాలను అంతపెద్దగా పట్టించుకోరంట. ఒక వేళ ఎవరైనా ఆ తప్పులను గుర్తు చేస్తే ఎప్పుడు? అవునా అంటూ జీనియస్‌లు ప్రతిస్పందిస్తారంట.