Queen of South
-
క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా భవానీ
సాక్షి, అగనంపూడి(గాజువాక): క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా కిరీటాన్ని విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన అమ్మాయి దక్కించుకుంది. ఇండియన్ మీడియా వర్క్స్ సీఈవో జాన్ అమలాన్ సారథ్యంలో ఈ ఏడాది జూన్ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా 2020 ఆన్లైన్ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో గాజువాక మండలం కూర్మన్నపాలేనికి చెందిన కె.భవానీ దుర్గ క్వీన్ కిరీటం సాధించింది. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళా రాష్ట్రాలకు చెందిన మగువలు పాల్గొన్నారు. మొదటి రౌండ్లో గ్రీన్ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్లో ర్యాంప్ వాక్, మూడో రౌండ్లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు సందించారు. పోటీల ఫలితాలు గత నెల 30న వెలువడ్డాయి. మూడు విభాగాల్లో భవానీదుర్గా ప్రతిభ చూపి క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఎంపికైంది. భవానీ నగరంలోని ఆదిత్యా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల ప్రోత్సాహంతో తనకు ఈ అరుదైన గుర్తింపు లభించిందని భవానీదుర్గా చెప్పింది. -
హుమా ఖురేషి క్వీన్ అవుతుందా?
బాలీవుడ్ నటి హుమా ఖురేషి క్వీన్ చిత్ర నాయకి అవుతుందా?. కోలీవుడ్‌లో తాజాగా చర్చల్లో నలుగుతున్న పేరు ఈ బ్యూటీదే. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ పొందిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఒరిజినల్లో నటించిన కంగణా రనౌత్ పాత్రను దక్షిణాదిలో నటించిన నటి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ప్రముఖ నటీమణులు నయనతార, త్రిష, సమంత, కాజల్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా హుమా ఖురేషి పేరు వెలుగులో కొచ్చింది. ఈ బ్యూటీ ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రంలో నటించింది. ఇప్పుడీ భామ దక్షిణాది క్వీన్ కాబోతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయం గురించి దర్శక, నిర్మాత త్యాగరాజన్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే హుమా ఖురేషి క్వీన్ చిత్ర రీమేక్‌లో నటించే విషయమై తనను సంప్రదించిందని చెప్పారు. అయితే ఈ విషయం గురించి తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ప్రశాంత్ హీరోగా నటిస్తున్న సాహసం చిత్రం పైనే ఉన్నట్లు చెప్పారు. క్వీన్ చిత్రం వచ్చే ఏడాది మార్చిలోనే సెట్‌పై వెళుతుందని త్యాగరాజన్ స్పష్టం చేశారు.