నగరంలో అందాలు
సాక్షి,సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్లో తిరుగాడే మనుషులకు కాస్త పచ్చదనం కనిపిస్తే మనసు ఆగిపోతుంది. అక్కడే ఉండాలనిపిస్తుంది. మరి ప్రకృతిలో పుట్టిపెరిగే పక్షులు ఎంత ఆనందిస్తాయో..! నగరం నాలుగు దిశలా విస్తరిస్తున్న వెలస్తున్న ఆకాశ హర్మా్యలు బతుకును దుర్భరం చేస్తున్నాయి. అక్కడక్కడా ఉన్న తోటలు పక్షులకు ఆవాసం కల్పిస్తున్నాయి.
అలాంటి వాటిలో కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ ప్రాంతం ఒకటి. చిన్నపాటి అడవిని తలపించే ఈ ప్రాంతంలో రకరకాల పక్షుల కిలకిల రావాలు పలుకుతున్నాయి. నెమళ్లు, గువ్వలు, కింగ్ ఫిషర్, టిట్లక్ పిట్ట, గుడ్లగూబ, గోరింకలు.. కొన్ని విదేశీ పక్షలు సైతం ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన దృశ్యాలివి.