rabies disease
-
పిల్లే కదా అనుకుంటే..
శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్ మల్లప్ప తెలిపారు. పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు. -
కుక్క కరిచిన విషయాన్ని దాచి, నెలరోజల్లోనే విలవిల్లాడుతూ..
ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పకపోవడంతో.. నెలన్నర తర్వాత ప్రాణాంతక రేబిస్‌తో (కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి) చనిపోయాడు. తండ్రి భూజాల మీదే చిన్నారి కన్నుమూయడం హృదయ విదారకం. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న షావేజ్‌గా గుర్తించారు. వివరాలు.. విజయ్ నగర్ పీఎస్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావేజ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెలన్నర కిత్రం అతన్ని పక్కింటి వారికి చెందిన కుక్క కరిచింది. ఈ విషయాన్ని చిన్నారి భయంతో తన తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా దాడిపెట్టాడు. అయితే ఆ కుక్కకు వ్యాక్సిన్ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్ వ్యాధి వ్యాపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. అన్నం తినడం మానేసి వింతగా ప్రవర్తించడం, కుక్కలా మొరగడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో కొన్ని రోజుల క్రితం కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు. షావేజ్ కుటుంబీకులు అతన్ని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స చేసేందుకు చేర్చుకోకపోవడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి క్షీణించడంతో బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు బయల్దేరారు. If you can't vaccinate 🐕, then don't domestic one. Yesterday evening a 14-yr-old Shavez, died in his father's arm, as he did not inform his parents about dog bite, which he suffered more than a month ago due to negligence of his neighbour. #Ghaziabad #UttarPradesh pic.twitter.com/45wVyPw5nC — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 5, 2023 అంబులెన్స్‌లో ఘజియాబాద్‌కు తీసుకువస్తున్న సమయంలో బాలుడు తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నొప్పితో మెలికలు తిరుగుతున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు బాలుడి మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. STORY | Ghaziabad boy dies of rabies over a month after dog bite, hid incident from parents out of fear READ: https://t.co/Ialssrekma VIDEO: pic.twitter.com/4VGnf1t4Y2 — Press Trust of India (@PTI_News) September 6, 2023 -
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!
ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ‘ప్రపంచ జునోసిస్ డే’ను నిర్వహిస్తుంటారు. పొంచి ఉన్న వ్యాధులు మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువుల నుంచి, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ర్యాబిస్ నివారణ చర్యలు ►ర్యాబిస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. ►అలాగే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అప్రమత్తత అవసరం జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమైనవి. మన పరిసరాల్లో ఉండే జంతువుల నుంచే వస్తాయి. జంతువులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం వల్ల, కుక్కలు నేరుగా మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ర్యాబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ జూనోసిస్ వ్యాదుల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పశువైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్లు వేస్తున్నాము. – డాక్టర్ సనపల లవకుమార్, మల్టీ స్పెషలిస్ట్, పశువైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం -ఇచ్ఛాపురం రూరల్, శ్రీకాకుళం చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి
మొవ్వ (పామర్రు): పిల్లి కాటుకు గురైన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలోని ఆర్ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కమల, నాగమణి ఆరోగ్యంలో త్రీవ మార్పులు రావడంతో కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. అయినా.. మెరుగు పడలేదు. కమల గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో చనిపోయింది. నాగమణి శుక్రవారం మొవ్వ పీహెచ్సీలో వైద్యం చేయించుకుని అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె కూడా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతి చెందిన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకిందని వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. కాగా మహిళలను కరిచిన పిల్లిని ఓ కుక్క కరిచిందని, ఆ కుక్క కూడా కొద్దిరోజులకే చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు. -
గ్రామాల్లో వీధి కుక్కలన్నింటికీ టీకాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు. వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా. -
కుక్కకాటుకు మందులేదు!
సాక్షి, అనంతపురం: ఆస్పత్రుల్లో కుక్కకాటుకు సూది మందు అందుబాటులో లేకుండా పోయింది. జిల్లాలోని వివిధ పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) కొరత ఏర్పడింది. దీంతో కుక్కకాటు బాధితులు అవస్థలు పడుతున్నారు. క్రమపద్ధతిలో వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా.. ఉన్న ఫలంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతో కుక్కకాటు బాధితులు ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రైవేట్ మందుల దుకాణంలో ఒక్కో ఏఆర్వీ వాయిల్æ రూ.350 నుంచి రూ.400 అమ్ముడు పోతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోలేక పేదలు సతమతమవుతున్నారు. కుక్కకాటు బాధితులు మొదటి రోజు 1 డోస్, మూడో రోజు రెండో డోస్, 7వ రోజు మూడో డోస్, 28వ రోజు నాల్గో డోస్ వేసుకోవాలి. జిల్లాలోని ఆస్పత్రులకు ప్రతి నెలా 8 వేల నుంచి 10 వేల వాయిల్స్ అవసరముంటుందని ఫార్మసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజూ 80 మందికి ఏఆర్వీ వేస్తుంటారు. అలాంది రెండ్రోజులుగా వ్యాక్సిన్ వేయడం లేదు. దీంతో డోస్ మిస్ అవుతుందని కుక్కకాటు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కొరత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఆర్వీ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అప్పట్లో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఆగమేఘాలపై అధికారులు సమకూర్చారు. ఈ వ్యాక్సిన్ సరఫరా చేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. ఉత్పత్తిని తగ్గించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నా.. వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సదరు కంపెనీకి బకాయిలు చెల్లించకపోవడంతో పాటు సరఫరా సక్రమంగా లేదంటూ అపరాధరుసుం వేయడం కూడా కారణంగా తెలుస్తోంది. -
కాటేస్తే కాటికేనా..!
ఇంజక్షన్ల సరఫరా లేదుయాంటీ రేబీస్ ఇంజక్షన్లసరఫరా ఈ నెల ఒకటో తేదీ నుంచి నిలిచిపోయింది. స్టాకు రావడం లేదు. ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే వినియోగిస్తున్నాం. స్టాకు రావాల్సి ఉంది. కాకినాడ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్(సీడీఎస్) సిబ్బంది, తూర్పుగోదావరి, పిఠాపురం: గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. తమను చంపే దమ్ము ఎవరికీ లేదనుకుంటున్నాయో ఏమో దొరికిన వారందరిపైనా దాడులు చేస్తున్నాయి. ఫలితంగా అనేక మంది కుక్కకాటుకు గురై ప్రాణ భయంతో వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటు వ్యాక్సిన్ నిండుకోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను యాంటీ రేబిస్ ఇంజక్షన్లు సరఫరా నిలిచిపోయింది. గత మార్చి నెల వరకు ఇంజక్షన్లు ఉన్నప్పటికీ మార్చి నెలాఖరు నుంచి సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో ఏ ఒక్క పీహెచ్సీలోను ఈ ఇంజక్షన్లు లేక ప్రతి రోజు వేల మంది బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ వందకుపైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. పీహెచ్సీలలో యాంటీరాబిస్ ఇంజక్షన్ల కొరత బాధితులను కలవరపెడుతోంది. నిలిచిపోయిన యాంటీ రేబిస్ ఇంజక్షన్ల సరఫరా... జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రులకు యాంటీ రేబిస్ ఇంజక్షన్ల సరఫరా కాకినాడలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ (సీడీఎస్) నుంచి సరఫరా అవుతుంది. అయితే ఈ నెల ఒకటో తేదీ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ఎక్కడా యాంటీ రేబీస్ ఇంజక్షన్లు లేకుండా పోయాయి. ప్రతి నెలా ఇక్కడి నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వాసుపత్రులకు సుమారు 50 వేల డోసులు సరఫరా చేస్తుంటారు. ఒక్కో బాధితుడికి ఐదుసార్లు ఇంజక్షన్లు చేయాల్సి ఉంది. ఒక్కో ఇంజక్షన్ బయట మార్కెట్లో రూ . 350 వరకూ విక్రయిస్తున్నారు. అంటే ఐదుసార్లు చేయించుకుంటే రూ.1750లు వెచ్చించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో ఇంజక్షన్లు లేక ఒకసారి చేసి లేదనిపించేస్తున్నారు. గర్భ నిరోధక చర్యలు శూన్యం... శునకాలకు గర్భ నిరోధక చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి గ్రామంలోనూ వీటి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా నివారించే చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కుక్కలను సంహరించ కూడదన్న నిబంధనలు ఉండడంతో సుమారు మూడు సంవత్సరాల నుంచి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.దీంతో జిల్లాలో లక్షకు పైగా కుక్కలు పెరిగిపోయి విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఏడాదిగా పిఠాపురం నియోజకవర్గంలోనే సుమారు 150 వరకు గేదె దూడలు కుక్కకాటు వల్ల చనిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో 20 గేదె దూడలపై దాడి చేసి చంపేసినట్టు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వందల సంఖ్యలో పెరిగిపోయిన కుక్కలు వీధుల్లో స్త్వైరవిహారం చేస్తూ చిన్నలు, పెద్దలనే తేడాలేకుండా దాడులు చేస్తుండడంతో భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క పిఠాపురం మున్సిపాలిటీలోనే సుమారు 2 వేల కుక్కలున్నాయంటే కుక్కలు ఎంతగా పెరిగిపోతున్నాయో అర్ధమవుతుంది. ఆపరేషన్లు చేస్తే దాడులు ఆగుతాయా..? ఆపరేషన్లు చేస్తే కుక్కల సంతతి వృద్ధి చెందకుండా ఉంటుంది తప్ప దాడులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలంటే ముందుగా వాటిని బంధించడానికి బోనులు ఏర్పాటు చేయాలి. ఒక్కో బోనులో ఐదు కుక్కలను మాత్రమే తీసుకెళ్లేందుకు ఆపరేషన్ చేసేందుకు వీలుంటుంది. వాటికి ఆపరేషన్ పూర్తయ్యాక సుమారు ఐదు రోజులు నిత్యం గమనిస్తుండాలి అవసరమైతే వైద్య సేవలందించాలి. అప్పటి వరకు ఆ కుక్కలను బోనులోనే ఉంచాలి. ఈ విధంగా అయితే గ్రామాల్లో ఉన్న వందల కుక్కలకు ఆపరేషన్లు పూర్తి కావాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇంతలో సుమారు 100 కుక్కలు సంతానోత్పత్తి చేసినా ఒక్కో కుక్క నాలుగు పిల్లలను పెట్టినా మరో నాలుగు వందల కుక్కలు పెరుగుతాయి. -
కుక్క కాటుతో రేబిస్ ముప్పు
పెంపుడు కుక్కలను మనుషులతో సమానంగా ప్రేమగా చూసుకునే వారిని మనం నిత్య జీవితంలో చాలా మందిని చూస్తుంటాం, వాటితో ఉండే అనుబంధం అలాంటిది. కానీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కల సహవాసంతో ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఎందుకంటే ప్రమాదకరమైన రేబిస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందేది కుక్కల వల్లే. అయితే కుక్కల వల్ల రేబిస్ వ్యాధి వ్యాపించే విధానం, నిర్మూలనా మార్గాలపై అవగాహన కల్పించడానికై ఏటా సెప్టెంబరు 28న రేబిస్ నివారణా దినంగా జరుపుకొంటారు. - దోమ * సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం * నేడు రేబిస్ నివారణ దినం రేబిస్ వ్యాధి ప్రధానంగా రేబిస్ అనే వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా కుక్కల్లో కనబడుతుంది. కుక్కల ద్వారా మానవులకు ఈ వైరస్ సోకి మొదడు పనితీరును తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సరైన చికిత్స అందకపోతే మరణానికి కూడా దారితీస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తుంపర వెదజల్లినా ఇతరులకు సోకుతుంది. రేబిస్ వ్యాధి లక్షణాలు.. విపరీతమైన జ్వరం, తల నొప్పి, ఒళ్ల నొప్పులు రేబిస్ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. వ్యాధిగ్రస్తులలో మెదడు ఉద్వేగానికి లోనై అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ప్రతి చిన్న విషయానికి భయాందోళనకు గురవుతుంటారు. కుక్క కాటు వేసిన ప్రదేశంలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కుక్క కరిచిన 4 నుంచి 6 వారాల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయి. రేబిస్ సోకకుండా ఉండాలంటే... రేబిస్ వైరస్ సోకకుండా ఉండాలంటే పెంపుడు కుక్కలకు పుట్టిన ఆరు వారాల లోపు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి. 2 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించాలి. తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలి. కుక్క కరిస్తే ఇలా చేయాలి.. * కుక్క కాటు వేసినపుడు అనవసర ఆందోళనకు గురికావద్దు. * కరిచిన ప్రదేశంలో గాయాన్ని డెటాల్‌తో శుభ్రంగాా కడగాలి. * వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు వెళ్లి ఇంజక్షన్ చేయించుకోవాలి. * కరిచిన కుక్కకు రేబిస్ వ్యాధి ఉందో లేదో నిర్ధిరించుకుని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. * ఆంటీ రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్‌లను తప్పకుండా వేయించుకోవాలి. వెంటనే చికిత్స అవసరం.. కుక్క కాటుకు గురైన వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. సంబంధిత ఇంజక్షన్ చేయించుకోవాలి. తద్వారా రేబిస్ వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. కుక్కలను పెంచేవారు వాటికి ఆంటీ రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. తద్వారా రేబిస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. - కృష్ణ, వైద్యాధికారి, దోమ