racially abused
-
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. పదవికి రాజీనామా
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యొషిరో మోరి తన పదవికి రాజీనామా చేశారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి కూడా అయిన 83 ఏళ్ల మోరి ఇటీవల జరిగిన ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ‘మహిళలు అతిగా మాట్లాడతారు. వారికి మైకులిస్తే అంతేసంగతి. సుత్తి ప్రసంగాలతో సభాసమయాన్ని వృథా చేస్తారు’ అని అనుచితంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరికి పదవీచ్యుతుణ్ని చేసేదాకా వెంటాడాయి. -
బ్రౌన్ డాగ్.. బిగ్ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి
సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.(చదవండి: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) నాలుగోరోజు ఆటలో భాగంగా రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు 'బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తో పాటు కెప్టెన్ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్) ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. కాగా క్రికెటర్లపై ఇలా జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం ఎంత రచ్చగా మారిందో అందరికి తెలిసిందే.(చదవండి: కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు) Bring back Kohli for the 4th Test Match This drunk australians are Abusing Siraj non-stop#INDvsAUS pic.twitter.com/C56IIZcfow — Gaurav (@GauravK_8609) January 10, 2021 -
అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు!
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య అనంతరం అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇందుకు భారత సంతతికి చెందిన ఓ మహిళా ఉద్యోగి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోనే ఉదాహరణ. ఎక్తా దేశాయ్ అనే భారతీయ మహిళ న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో తాను ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. న్యూయార్క్‌లో లోకల్ ట్రైన్లో వెళ్తుండగా ఓ అమెరికన్ ఆమె వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించాడని తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అమెరికన్ తనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడగా, ఆ సమయంలో రైల్లో దాదాపు 100 మంది ప్రయాణికులున్నారని తెలిపింది. హెడ్ ఫోన్స్‌తో తిరుగు ప్రయాణంలో కాలక్షేపం చేస్తున్న తన వద్దకు ఓ వ్యక్తి వచ్చాడని, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని.. మీ దేశానికి వెళ్లిపో (గో బ్యాక్ టూ యువర్ కంట్రీ) అంటూ బెదిరించాడని ఎక్తా దేశాయ్ పేర్కొంది. తాను మాత్రం అతడితో వాదించే ప్రయత్నం చేయలేదట. తన తర్వాత అదే కంపార్ట్మెంట్లో ఉన్న మరో ఆసియా యువతిపై ఇదే తీరున రెచ్చిపోవడంతో రైల్వే పోలీసులకు ఎక్తా దేశాయ్ ఫిర్యాదు చేసింది. మొబైల్లో రికార్డు చేసిన వీడియోను పోలీసులను చూపించింది. తాను తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని, తాను ఏ మహిళను తాకలేదంటూ అమెరికన్ వ్యక్తి చెప్పినట్లు వీడియోలో రికార్డ్ అయింది. పోలీసులు మాత్రం అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని సమాచారం. కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య ఉదంతం అనంతరం ఎక్తా పోస్ట్ చేసిన వీడియో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జాతి విద్వేష దాడులు, కాల్పులపై అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.