
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యొషిరో మోరి తన పదవికి రాజీనామా చేశారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి కూడా అయిన 83 ఏళ్ల మోరి ఇటీవల జరిగిన ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ‘మహిళలు అతిగా మాట్లాడతారు. వారికి మైకులిస్తే అంతేసంగతి. సుత్తి ప్రసంగాలతో సభాసమయాన్ని వృథా చేస్తారు’ అని అనుచితంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరికి పదవీచ్యుతుణ్ని చేసేదాకా వెంటాడాయి.
Comments
Please login to add a commentAdd a comment