రంగారెడ్డి కలెక్టరేట్ కోసం ‘రహేజా’ భవనం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ కోసం మహేశ్వరం మండలం రావిర్యాల హార్డ్‌వేర్‌పార్కులో గల రహేజా కంపెనీ భవనాన్ని సోమవారం ఎంపీలు, అధికారులు పరిశీలించారు. శ్రీశైలం జాతీయరహదారి పక్కనే ఉన్న ఈ భవనం అందరికీ అందుబాటులో ఉంటుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా భవన సముదాయం వద్ద ఉన్న ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. పరిశీలించిన వారిలో కలెక్టర్ రఘునందన్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఎం.కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, ఎ.గాంధీ ఉన్నారు.