బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నం
రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. దీనిని గమనించిన పోలీసులు గాంధీభవన్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం గాంధీభవన్ నుంచి బయటకు వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.