769 బంగారు కుండలు మాయం!
అనంత పద్మనాభ స్వామి ఖజానాపై సుప్రీంకు రాయ్ నివేదిక
న్యూఢిల్లీ: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్లు సుప్రీంకోర్టుకు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్‌రాయ్ నివేదిక సమర్పించారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 186 కోట్లని, దాన్ని దొంగిలించి ఉండొచ్చన్నారు. ‘సీ, ఈ నేలమాళిగల్ని తెరచి ఆగస్టు 2007లో 1022 వస్తులతో పాటు 397 బంగారు కుండల్ని ఫొటోలు తీశారు. ఆ కుండలపై వెయ్యి నుంచి సంఖ్యలుండగా... ఒకదానిపై 1988 సంఖ్యను గుర్తించారు.
అంటే మొత్తం ఖజానాలో 1988 బంగారు కుండలుండాలి. రాజభవనంలో పనుల కోసం 822 కుండల బంగారాన్ని కరిగిస్తే ఇంకా 1,166 కుండలు ఉండాలి. కానీ 397 మాత్రమే దొరి కాయి. మాయమైన 769 కుండల్లో రూ. 186 కోట్ల విలువైన 776 కిలోల బంగారముండవచ్చు. 35 కిలోలు బరువైన రూ.14 లక్షల వెండి కడ్డీ కూడా మాయమైంది. 1970లో అమ్మి న 2.11 ఎకరాల భూమికి సంబంధించి రికార్డులు లేవు. హుండీలో వేసిన 572.86 గ్రా. బంగారం, 2589 గ్రా. వెండి రిజిస్టర్లో నమోదు చేయలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు.