స్వైన్ ఫ్లూ కేసు నమోదు
రైల్వేకోడూరు: రైల్వేకోడూరు మండలంలోని గంగురాజుపోడు ఎస్టీ కాలనీలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మంగళవారం డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయ వ్యాధి నిర్ధరణ అధికారి ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ గ్రామంలోని ఒక దంపతులకు పుట్టిన సంవత్సరం వయస్సు ఉన్న బాబుకు కొద్దిరోజుల నుంచి జ్వరం వస్తోంది. కోడూరులోని పలు ఆసుపత్రుల్లో చూపించారు. తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.అక్కడి వైద్యుల సలహా మేరకు వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఆ బాబు అక్కడే వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు కేఎస్వీ ప్రసాద్, సుధాకర్, స్థానిక డాక్టరు మనోజ్ కుమార్, ఎంపీహెచ్ఈఓ ఎస్ఎస్ దాస్, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.