
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శెట్టిగుంట (రైల్వేకోడూరు రూరల్): రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట చెరువు కట్ట సమీపంలోని ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ముళ్ల పొదలలో ఉన్న దుంగలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 9 దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దొరికిన దుంగలు ఎవరివి, ఎందుకు అక్కడ ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.