Rs 10 lakh
-
హ్యాకర్లకు మైక్రోసాఫ్ట్ సవాల్!
న్యూయార్క్: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ బగ్బౌంటీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. పరిమిత కాలానికిగాను బగ్ బౌంటీ ఆపరేషన్స్ వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేసింది. బగ్ పట్టు రూ.10 లక్షలు పట్టు అంటూ హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్ విసిరింది. తమ సేవల్లో లోపాలు వుంటే పసిగట్టినవారికి నగదు బహుమతిని ఆఫర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆన్లైన్ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యురిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20లక్షలు(30వేల డాలర్లు) దాకా చెల్లించనుంది. వీటిలో కనీసం 500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10లక్షలు) నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇలా సమర్పించినవాటిలో అర్హులైన వారికి కనీసం 500 డాలర్లనుంచి 15 వేల డాలర్ల వరకు అందించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో ఎలిపింది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పోర్టల్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ కు సంబంధించి మార్చి 1 - మే 1 మధ్య కాలంలో సమర్పించిన అర్హులైన హ్యాకర్లు డబుల్ బొనాంజాకు అర్హులవుతారని తెలిపింది. ఇలా అందిన అర్హమైన రిపోర్టులకు సుమారు30 వేల డాలర్లదాకా అందించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంటుందని, దాడి ప్రభావం ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. క్రాస్ సైట్ స్ర్కిప్టింగ్; క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ, అనధికారిక క్రాస్ టెనంట్ డేటా టాంపరింగ్, యాక్సెస్ మల్టీ టెనంటింగ్ సర్వీసెస్ లాంటి ఇతర సర్వీసులలో వీటిని కనుగొనాల్సింది ఉంటుంది. అలాగే పోర్టల్.ఆఫీస్.కాం, ఔట్లుక్. ఆఫీస్365.కాం, ఔట్లుక్. ఆఫీస్.కాం లాంటి ఇతర నిర్దిష్ట డొమైన్లలో ఆయా దాడులను, ప్రభావాన్ని విశ్లేషించాలని మైక్రోసాఫ్ట్ హ్యాకర్లను సవాల్ చేసింది. కాగా తమ కంపెనీ ఉత్పత్తులలో సెక్యురిటీ లోపాలను గుర్తించమని హ్యాకర్లకు సవాల్ చేసే కార్యక్రమే బగ్‌బౌంటీ ఆపరేషన్స్. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో ‘సెక్యూరిటీ లోపాలు కనిపెడితే భారీ బహుమతిఅని హ్యాకర్లకు సవాల్ చేస్తుంటాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు. ఇప్పటికే గూగుల్.. ఫేస్బుక్.. మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ తదితర సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం తెలిసిందే. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శెట్టిగుంట (రైల్వేకోడూరు రూరల్): రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట చెరువు కట్ట సమీపంలోని ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ముళ్ల పొదలలో ఉన్న దుంగలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 9 దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దొరికిన దుంగలు ఎవరివి, ఎందుకు అక్కడ ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. -
పేలుడు బాధితులకు రూ.10 లక్షలు
తిరువనంతపురం: కేరళలో జరిగిన విషాధంపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండులక్షల సాయాన్ని ప్రకటించారు. కేరళలోని పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. బాణాసంచా పేలుడు కారణంగా ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. -
శ్రీమంతుడి ఔదార్యం
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శక త్వంలో వచ్చిన ‘శ్రీమం తుడు’ ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. మహేశ్ ఉపయోగించిన సైకిల్ కోసం 2,200మంది నమోదు చేసుకున్నారు. ఈ కాంటెస్ట్‌కు వచ్చిన డబ్బులో రూ.10 లక్షలను ‘బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి’కి, రూ.5 లక్షలను ‘హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్’కు యూనిట్, మహేశ్ భార్య నమ్రత ఇచ్చారు. -
రూ.10 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
బనగానపల్లె: పట్టణంలో హోల్‌సెల్ గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, ప్రసాద్, దత్తుల నుంచి ఆదివారం రూ.10 లక్షల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పంచనామ నమోదు చేసినట్లు బనగానపల్లె సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ మంజునాథ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. బనగానపల్లెలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు పలు గౌడోన్లపై దాడులు జరిపి గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గుట్కాలతో పాటు నమోదు చేసిన పంచనామను ఫుడ్ఇన్స్పెక్టర్కు అందజేస్తున్నామన్నారు. విచారణ తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ వీరికి నిబంధనల మేర జరిమానా విధిస్తారని తెలియజేశారు. మూడు రోజుల క్రితమే మరో రూ.10 లక్షల విలువ గల గుట్కాలు ఇతర ప్రాంతాలకు రవాణ జరిగినట్లు సమాచారం అందిందన్నారు. వాటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గుట్కా రవాణా ఎక్కువగా ట్రాన్స్‌పోర్టుల ద్వారా జరుగుతోందని తెలిపారు. గుట్కాలు ట్రాన్స్‌పోర్టులో లభిస్తే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా, మట్కా, పేకాట, జూదాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.