
పేలుడు బాధితులకు రూ.10 లక్షలు
తిరువనంతపురం: కేరళలో జరిగిన విషాధంపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండులక్షల సాయాన్ని ప్రకటించారు.
కేరళలోని పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. బాణాసంచా పేలుడు కారణంగా ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది.