Chief Minister Oommen Chandy
-
ఉమెన్ చాందీ రాజీనామా
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తన పదవికీ రాజీనామా చేశారు. శుక్రవారం పదిన్నర గంటల ప్రాంతంలో తన రాజీనామా లేఖను గవర్నర్ పీ సదాశివంకు అందించారు. గవర్నర్ బంగ్లాకు స్వయంగా వెళ్లి నమస్కరించిన చాందీ.. ఆ తర్వాత రాజీనామా లేఖ సమర్పించి బయలుదేరారు. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వామపక్ష కూటమి చేతిలో చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎల్డీఎఫ్ ఇక్కడ విజయాన్ని సాధించింది. దీంతో సంప్రదాయం ప్రకారం చాందీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు 91 స్థానాలు రాగా.. చూడీఎఫ్ కు కేవలం 46 స్థానాలు మాత్రమే వచ్చాయి. -
'ఎండ'కు కరిగిన స్టార్ హీరో.. సీఎంతో భేటీ
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నీళ్లు, నీడ లేక జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి పిల్లల్లా రాలిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ పరిస్థితులను చూసి సూపర్ స్టార్ మమ్ముటి మనసు కరిగింది. ఎండలో బాధపడుతున్నవారికోసం సహాయక చర్యలు చేయాలనుకున్నారాయన. పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఫోన్లుచేసి, వ్యక్తిగతంగా కలిసి.. తనతో కలిసిరావాలని కోరారు మమ్ముటి. అందుకు వారూ సరేనన్నారు. తన ప్రణాళికకు ప్రభుత్వ సాయం కూడా బాగుంటుందని భావించిన ఆయన బుధవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిసి, సహకరించాలని కోరారు. మమ్ముటి ఆలోచనలు విన్న సీఎం అప్పటికప్పుడే ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు (గురువారం) అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకుని ఎండల తీవ్రతపైనే సమీక్షలు నిర్వహిస్తానని, ఇదే అంశం ఎజెండాగా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తానని సీఎం చాందీ వెల్లడించారు. మమ్ముటి చెప్పిన విషయాలను కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని సమాచారం. కేరళలో గత నాలుగు రోజులుగా ఎండలు తీవ్రస్థాయికి ఎగబాకాయి. పాళక్కడ, కన్నూర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటాయి. శనివారం నాటికి 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఎండతీవ్రతతో బాధపడుతున్నవారికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు మమ్ముటి. అయితే ఆయన చేపట్టబోయే చర్యలు ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది కేరళలో మునుపెన్నడూలేని విధంగా ఎండ అధికంగాఉంది. -
పేలుడు బాధితులకు రూ.10 లక్షలు
తిరువనంతపురం: కేరళలో జరిగిన విషాధంపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండులక్షల సాయాన్ని ప్రకటించారు. కేరళలోని పరవూర్‌లో పుట్టింగళ్ దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామన జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందిపైగా మృతి చెందగా, 200 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. బాణాసంచా పేలుడు కారణంగా ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది.