ఉమెన్ చాందీ రాజీనామా | Kerala CM Oommen Chandy submits resignation to Governor P Sathasivam | Sakshi
Sakshi News home page

ఉమెన్ చాందీ రాజీనామా

Published Fri, May 20 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

Kerala CM Oommen Chandy submits resignation to Governor P Sathasivam

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తన పదవికీ రాజీనామా చేశారు. శుక్రవారం పదిన్నర గంటల ప్రాంతంలో తన రాజీనామా లేఖను గవర్నర్ పీ సదాశివంకు అందించారు. గవర్నర్ బంగ్లాకు స్వయంగా వెళ్లి నమస్కరించిన చాందీ.. ఆ తర్వాత రాజీనామా లేఖ సమర్పించి బయలుదేరారు.

కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వామపక్ష కూటమి చేతిలో చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎల్డీఎఫ్ ఇక్కడ విజయాన్ని సాధించింది. దీంతో సంప్రదాయం ప్రకారం చాందీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు 91 స్థానాలు రాగా.. చూడీఎఫ్ కు కేవలం 46 స్థానాలు మాత్రమే వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement