మొరాయించిన రైల్వే గేట్ - ట్రాఫిక్ జామ్
ఖమ్మం జిల్లా కారేపల్లి పట్టణంలోని గాంధీనగర్లో ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో రైల్వే గేటు మొరాయించింది. సాంకేతిక లోపంతో తెరచుకోకపోవడంతో ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది గేటును తెరిచేందుకు చర్యలు చేపట్టారు.