rain water leaks
-
వర్షానికి కారుతున్న మెట్రో స్టేషన్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అతిపెద్ద మెట్రో రైల్ స్టేషన్‌గా ప్రసిద్ధిగాంచిన మెజిస్టిక్ స్టేషన్లో వాననీరు కారుతుండటం కలకలం రేపుతోంది. భూగర్భంలో ఉన్న ఈ మెట్రో పనులు నాసిరకంగా చేయడమే దీనికి కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి. సోమ, మంగళవారం రాత్రి సమయాల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. టికెట్ కౌంటర్ల వద్ద వాన నీరు కారుతుండటం గమనించిన అధికారులు ప్లాస్టిక్ బకెట్లను పెట్టారు. గురువారం ఉదయం దీన్ని గమనించిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైలు ప్రయాణించే సొరంగ మార్గంలో కూడా నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటీవలే నిర్మించిన మెట్రో స్టేషన్లో మామూలు వానలకే నీరు కారటం ఏమిటని సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
గొడుగు కింద పాఠాలు!
ధారూరు : మండలం నాగారం పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు ఉరుస్తుంది. దీంతో విద్యార్థులు నిత్యం గొడుగుల కింద కూర్చొని పాఠాలు వింటున్నారు. యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
వైఎస్ జగన్ ఛాంబర్లో వర్షపు నీరు లీకేజీలు
-
వైఎస్ జగన్ ఛాంబర్లో మళ్లీ వర్షపు నీరు
సాక్షి, అమరావతి : కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం పరిసరాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో సచివాలయం చెరువును తలపిస్తోంది. అంతే కాకుండా సచివాలయం గేట్-2 వెయిటింగ్ హాల్ సైతం వర్షపు నీరు లీకేజీ అవుతోంది. దీనితో పాటు అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్లో మరోసారి వర్షపు నీరు లీకేజీ అవుతోంది. సీలింగ్ నుంచి నీరు కారుతోంది. గత ఏడాది జూన్ నెలలో కురిసిన భారీ వర్షానికి ఇదే తీరుగా ప్రతిపక్ష నేత ఛాంబర్లో నీరు చేరింది. దీంతో వర్షం నీటిని బయటకు పంపించడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అయితే దీనిపై వైఎస్సార్ సీపీ తీవ్ర నిరసనలు చేపట్టడంతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన కమిటీ పైపులను కోసేశారంటూ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కురిసిన వర్షం కారణంగా మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని ప్రతిపక్షనేత ఛాంబర్‌తో పాటు పలు వెయిటింగ్ హల్లో నీరు చేరడంతో సచివాలయ నాణ్యతపై పలు సందేహాలు వెలువడుతున్నాయి.