వరదాయిని..రాజరాజేశ్వరీ
పాశ, అంకుశంలను ధరించి చెరకుగడను చేతబూని మందస్మితంతో ఆశీనురాలై సకల లోకాలకు అధిదేవత శ్రీచక్ర నగర నాయకి అయిన రాజరాజేశ్వరిదేవిగా శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. శ్రీచక్రరూపంలో భక్తులందరూ కుంకుమార్చన చేసి తరించేది ఈ అమ్మవారిపూజతోనే. ఆమె చేతిలోని పాశం, అంకుశం భక్తుల కష్టాలను దూరం చేసే ఆయుధాలు. అభయముద్ర, చెరకు..భక్తులకు రమావాణిసేవిత రాజరాజేశ్వరీదేవి ఇచ్చే వరాలు. ఈ దేవిని సేవిస్తే ఉన్నత పదవులు లభిస్తాయని, ఇష్టకార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
- శ్రీశైలం