వరదాయిని..రాజరాజేశ్వరీ | rajarajeswary as varadayeni | Sakshi
Sakshi News home page

వరదాయిని..రాజరాజేశ్వరీ

Published Mon, Oct 10 2016 10:12 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

వరదాయిని..రాజరాజేశ్వరీ - Sakshi

వరదాయిని..రాజరాజేశ్వరీ

పాశ, అంకుశంలను ధరించి చెరకుగడను చేతబూని మందస్మితంతో ఆశీనురాలై సకల లోకాలకు అధిదేవత శ్రీచక్ర నగర నాయకి అయిన రాజరాజేశ్వరిదేవిగా శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు.  శ్రీచక్రరూపంలో భక్తులందరూ కుంకుమార్చన చేసి తరించేది ఈ అమ్మవారిపూజతోనే. ఆమె చేతిలోని పాశం, అంకుశం భక్తుల కష్టాలను దూరం చేసే ఆయుధాలు.  అభయముద్ర, చెరకు..భక్తులకు రమావాణిసేవిత రాజరాజేశ్వరీదేవి ఇచ్చే వరాలు. ఈ దేవిని సేవిస్తే ఉన్నత పదవులు లభిస్తాయని, ఇష్టకార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
- శ్రీశైలం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement