Rajeev Reddy
-
సమస్యలను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్
మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్‌లో అందరూ పాజిటివ్‌గానే స్పందించారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మీటింగ్‌లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్‌లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్ ముందుంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్’’ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
మెట్రోరైల్ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరగాలి
స్టే ఉన్నా ప్రైవేటు ఆస్తుల్లో పనులు కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు కంట్రీక్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని కంట్రీక్లబ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వై. రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) వ్యవహరిస్తోందని, ప్రైవేటు ఆస్తుల స్వాధీనంలో పారదర్శకత లేకపోవడంతో దీనిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లోనే మైట్రో రైల్వేస్టేషన్ నిర్మించాలని మెట్రో రైల్ ప్రాజెక్ట్ నివేదికలో పేర్కొన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి తమ కార్పొరేట్ ఆఫీసును స్వాధీనం చేసుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మెట్రో రైలు కోసం రూ.35 కోట్ల విలువైన 1,700 చదరపు అడుగుల స్థలం ఇచ్చినప్పటికీ, 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్న కార్పొరేట్ ఆఫీసును కూడా స్వాధీనం చేసుకుంటోందన్నారు. 2006లో కార్పొరేట్ ఆఫీసు నిర్మించుకోవడానికి అభ్యంతరం లేదంటూ హెచ్ఎంఆర్ఎల్ అనుమతి ఇచ్చిన తర్వాతనే దీన్ని నిర్మించినా ఇప్పుడు నోటీసులు జారీ చేసిందని, దీనిపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా కూల్చివేస్తామంటోందని రాజిరెడ్డి ఆరోపించారు. కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.